పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరకాల పట్టాభిరామారావు, స్వాతంత్ర సమరయోధులు, విశాలాంధ్రా దినపత్రిక విశ్రాంత సంపాదకులు విజయవాడ, ఫోన్‌:0866-2474635


పరిచయ వాక్యం

పరకాల పరిచయ వాక్యం

'భారత సాfiతంత్య్రోద్యమం: ముస్లింలు' గ్రంథాన్ని శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వ్రాయకపోతే భారత స్వాతంత్య్రోద్యామంలో ముస్లింలు నిర్వహించిన వీరోచిత పాత్ర,కొత్తతరం వారికే కాదు, పాత తరం వారిలో చాలా మందికి కూడ తెలియకుండ పోతుందనే చెప్పుకోవాలి. ఈ గ్రంధంలో భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రను విహంగ దృష్టితో వీక్షిస్తూ, అందులోని ప్రధాన ఘట్టాలలో ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల పాత్రను సోదాహరణంగా రచయిత తెలియజేశారు.

1765 ప్రాంతంలో బ్రిీటిష్‌ పాలకుల మీద తొలి తిరుగుబాటు జెండాను ఎగురవేసిన ముస్లిం ఫకీరులు- హిందూ సన్యాసుల సాయుధ పోరాటంతో ప్రారంభించి,వలసపాలకుల జోహుకుందారులుగా వ్యవహరిస్తున్న జమీందారులను, మహజనులు అనబడు వడ్డీ వ్యాపారులను ఎదాుర్కొన్న ఫరాజీ యోధుల తిరుగుబాట్లను, వహాబీ వీరుల పోరాటాలను, మలబారు మోప్లాలు సాగించిన అత్మార్పణల విశిష్ట ఉద్యమాలకు సంబంధించిన చాలా అరుదైన సమాచారాన్ని ఈ గ్రంధం అందిస్తుంది. ఆ పోరాటాల అపూర్వ చరిత్రను రచయిత ఉత్తేజపూర్వకంగా వివరించారు. ఆనాటినుండి పరాయి పాలకుల మీద యుధ్జం ప్రకటిచిన యోధుల చరిత్ర క్రమంలో టిపూసుల్తాన్‌ పాత్రను ప్రవేశపెడుతూ, విదేశీ శత్రువుతో పోరాడుతూ రణభూమిలో వీరమరణం పొందిన స్వదేశీ రాజులలో ఆయన ప్రధముడని రచయిత తెలిపారు. 7