పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ శివప్రసాద్‌ వీధి, కొత్తపేట వినుకొండ - 522647 గుంటూరు జిల్లా.

రచయిత మాట


గ్రంధాన్ని తొలిసారిగా 2001 ఆగస్టులో రాశాను. నాలుగు మాసాల వ్యవధిలో అనగా 2001 డిసెంబరులో యథావిధిగా పునర్ముద్రణయ్యింది. ఆ తరువాత ప్రస్తుతం మూడవసారి ముద్రణయ్యింది.

మూడవసారి మాత్రం ఈ గ్రంథాన్ని పూర్తి స్థాయిలో తిరగ రాశాను. ఆ కారణంగా గతంలో రెండు సార్లు ప్రచురితం అయినప్పుడు 80 పేజిలతో వచ్చిన గ్రంథం కాస్తా ప్రస్తుతం 394 పేజీలకు చేరుకుంది. ఈ గ్రంథాన్ని మరింతగా విస్తరింపచేయాలన్న సంకల్పంతో దశాబ్ద కాలంగా రాష్ట్రమంతా తిరిగి నేను సేకరించిన అదనపు సమాచారాన్ని, ఆ క్రమంలో లభించిన చిత్రాలు, ఫొటోలు ప్రస్తుత గ్రంథానికి జత చేశాను. నాకు ఎరుకలోకి వచ్చిన ఏ ఒక్క స్వాతంత్య్ర సమరయోధుడి వివరాలను వదిలిపెట్టకుండా, శత విధాల సమాచారం రాబట్టడనికి ప్రయత్నించి, ఆ విధంగా రాబట్టిన సమాచారాన్ని ఈ గ్రంథం ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేయడానికి ప్రయత్నించాను.

ఈ పుస్తక రచన కార్యభారాన్ని స్వీకరించాక అదనపు సమాచారం కోసం పలు మార్లు రాష్ట్రంలోని పర్యిటించాను. రాష్ట్రంలో చరిత్ర ప్రాధాన్యతగల పలు ప్రాంతాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్ళివచ్చాను. ఈ సందర్భంగా చాలా స్వాతంత్య్ర సమరయోధుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కలిశాను. ఆయా సమరయోధుల మిత్రులను, సన్నిహితులను సంప్రదించాను. ప్రాంతీయ, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి స్వాతంత్య్ర సమరయోధుల సంక్షేమ సంఘాలను, సంస్థలను, ఆ సంస్థలు నిర్వహిస్తున్న గ్రంథాలయాలలో పుస్తకాలను చూశాను.

ఈసారి నా సమాచార సేకరణలో చాలా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోని నా పుస్తకాలల్లోని ఒకటీ రెండు అంశాలు విషయపరంగా సరిగ్గానే ఉన్నా సంవత్సరాల అంకెల పరంగా, సంఘటన ప్రాధాన్యతల పరంగా కొన్ని మార్పులు-చేర్పులు చేయాల్సి వచ్చింది. ఈ విషయాల మీద మరోసారి నిర్ధారణ కోసం ప్రముఖ చరిత్రకారులను, వివిధ విశ్వవిద్యాలయా లలో చరిత్రను బోధి స్తున్న అధ్యాపకులను, ఆచార్యులను,