పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

1920 దశకంలో గాంధీజీ పిలుపు మేరకు ప్రభుత్వపదావిని త్యజించిన తొలి ఆంధ్రుడు మహమ్మద్‌ గులాం మొహిద్దీన్‌, చీరాల పేరాల ప్రజలకు బాసటగా నిలచిన మహమ్మద్‌ గౌస్‌ బేగ్, మన్యం పోరులో అల్లూరికి అండదండలందిచిన ఫజులుల్లా ఖాన్‌, ఖద్దార్‌ ఇస్మాయిల్‌గా పేర్గాంచిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌, పరిటాల రిపబ్లిక్‌ పతాక వీరుడు షేక్‌ మౌలా సాహెబ్‌, మాతృదేశ సేవకు సర్వం సమర్పించిన గౌస్‌ దంపతులు, 'జైహింద్‌- నేతాజీ' నినాదాల సృష్టికర్త అబిద్‌ హసన్‌ సఫ్రాని, జనహిత కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించిన సయ్యద్‌ అబ్దుల్‌ అజీం లాంటి యోధుల్ని ఆంధ్ర ప్రజానీకానికి పరిచయం చేసినందుకు నశీర్‌ అహమ్మద్‌ గారి కృషిని కొనియాడక తప్పదు. ఈయన రచించిన ఈ గ్రంథంలో మరోక ప్రత్యేకత ఏమిటంటే అంధ్రదేశ స్వాతంత్య్రోద్యమంలో పురుషులకు సాటిగా అనేక మంది ముస్లిం మహిళలు కూడ క్రియాశీలక పాత్ర వహించారని సోదాహరణంగా వివరిచడం. సంప్రదాయ చరిత్రకారులు కేవలం దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ లాంటి కొంతమంది అగ్రవర్ణ స్త్రీలను గురించి మాత్రమే ప్రస్తావించారు. అందుకు భిన్నంగా ఈ పుస్తకంలో బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా, బేగం మజీదా బానో, మాసుమా బేగం, ఫక్రుల్‌ హాజియా హసన్‌, నఫీస్‌ అయేషా బేగం, మహమ్మద్‌ గౌస్‌ ఖాతూన్‌, హజరా ఇస్మాయిల్‌, జమాలున్నీసా బాజి, రబియాబీ, రజియా బేగం, జైనాబ్‌ బీ లాంటి ఎందరో మహిళల వివరాలూ ఉన్నాయి.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారు వృత్తిరీత్యా చరిత్రకారుడు కాకపోయినా, ప్రవృత్తిరీత్యా గొప్ప చరిత్ర ప్రేమికుడు, మంచి చరిత్ర పరిశోధకుడు. ఆయన రచించిన అనేక వ్యాసాల్ని, పలు గ్రంథాల్ని చదివే అవకాశం నాకు కల్గింది. వాస్తవానికి సమాజంలో చారిత్రక అవగాహనకు, చైతన్యాన్నీ, స్పూర్తిని వ్యాప్తిచేయడంలో నశీర్‌ అహమ్మద్‌ లాంటిపరిశోధకుని పాత్ర ఎంతైనా శ్లాఘనీయం. చరిత్ర పరిశోధన, రచనలో ఆయన అనుసరించిన పద్దతి హేతుబద్దంగా, శాస్త్రీంగా ఉంటుదని చెప్పడానికి 'భారత స్వాతంత్య్రోద్యమం : ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' గొప్ప నిదర్శనం.

మొదాిసారిగా ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతి, స్వాతంత్య్రోద్యమంలో, సామాజిక నిర్మాణంలో ముస్లిం సామాజిక వర్గాల భాగస్వామ్యాన్ని సమగ్రంగా, ఆధారాల సహితంగా వివరించిన గ్రంథకర్త ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించక తప్పదు. బ్రిటిష్‌ వ్యతిరేక, స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గొన్న అనేక మంది ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల్ని, నాయకుల్ని, మేధావుల్ని పరిచయం చేసి ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర రచన, పరిశోధనలో చక్కని మార్గదర్సకత్వాన్ని వహించిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారు నిజంగా అభినందనీయులు.