పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆ ఛాయలు నైజాం గడ్డ మీదా కూడ కన్పించాయి. తిరుగుబాటు విఫలమైనా, స్వదేశీ యోధుల మీదా ఆంగ్లేయులది పైచేయిగా కన్పించినా స్వేచ్ఛా-స్వాతంత్య్ర కాంక్షపరులైన ప్రజలు మాత్రం పోరుబాట వీడలేదు. ఆంగ్లేయులను ప్రధాన శత్రువుగా పరిగణించిన పోరాటయోధులు తమ ఆయుధాలను తొలుత బ్రిటీషర్ల మీద ప్రయోగించి, ఆ తరువాత ఆంగ్లేయుల అడుగులకు మడుగులొత్తుతూ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న స్వదేశీ సంస్థానాధీశుల మీదా కూడ చివరకు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అభినందన పత్రం కల్గించిన ఆగ్రహం

ప్రథామ స్వాతంత్య్రసంగ్రామంలో ఆంగ్లేయుల పక్షంగా వ్యవహరించి తిరుగుబాటు జ్వాలల నుండి ఈస్ట్‌ఇండియా కంపెనీ అధికారులను రక్షించి బ్రిటిషర్ల మరికొంత కాలం ఆంగ్లేయుల పాలనకు ప్రాణం పోసిన నైజాం నవాబుకు బ్రిటిషర్లు అందచేసిన బిరుదులు, బహుమానాలు కూడ ప్రజలలో ఆగ్రహానికి కారణమయ్యాయి. 1859లో బ్రిటీష్‌ రెసిడెంట్ కలకత్తాకు వెళ్ళి నిజాం నవాబు కోసం ప్రశంసాపత్రం (ఖతీరా) తెచ్చాడు. ఈ వార్త తెలిసిన ప్రజలు మండిపడ్డరు. బ్రిీష్‌ రెసిడెంట్ తెచ్చిన ప్రశంసాపత్రం అభినందనపత్రం కాదని అది అవమానకర పత్రమని ప్రజలు, ప్రధానంగా పోరాటయోధులైన స్వదేశీ సిపాయీలు భావించారు. ఆంగ్లేయుల పట్ల పూర్తి విధేయత చూపుతూ నిజాం నవాబు ఆంగ్లేయుల అభినందనలను స్వీకరించడాన్ని స్వదేశీ యోధులు ఏమాత్రం జీర్ణం చేసుకోలేకపోయారు. ఈ విధాంగా రెసిడెంట్ తెచ్చిన ప్రశంసాపత్రాన్ని 1859 మార్చి 15న ప్రత్యేకంగా దార్బారు ఏర్పాటు చేసి, నైజాం సంస్థానాధీశునికి అందించాడు. ఈ అభినందాన పత్రం విషయం తెలుసుకున్న రోహిల్లా యోధాుడు జహంగీర్‌ ఖాన్‌ కోపంతో రగిలిపోయాడు. ఏదైనా చేస్తా లేకుంటే చస్తాననుకున్నాడు. నిజాం దేవిడి ముందు కాపుకాశాడు. నైజాం దార్బారులో ప్రశంసాపత్రం ప్రధాన కార్యక్రమం ఆర్భాటంగా ముగిసింది. ఆ ఆనందంలో నిజాం నవాబుతో పాటుగా దార్బారు నుండి దర్పంగా బయటకు వస్తున్న ఆంగ్లేయాధికారి డేవిడ్‌సన్‌ మీదా జహంగీర్‌ ఖాన్‌ కార్బన్‌తో దాడి చేశాడు. ఆ తుపాకి గుళ్ళ తాకిడి నుండి డేవిడ్‌సన్‌ తృటిలో తప్పుకున్నాడు. అయినా పట్టువదలని జంహీంగీర్‌ ఖాన్‌ ఆంగ్లేయుడ్ని ఎలాగైనా సంహరించాలన్న లక్ష్యంతో మరుక్షణం అతని మీద కత్తి దూశాడు. ఆలోగా నిజాం నబాబు అనుచరులు అప్రమత్తులై జహంగీర్‌ ఖాన్‌ మీదా కాల్పులు జరపడంతో ఆ యోధుడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఈ అనూహ్య సంఘటనతో బిత్తరపోయి ప్రాణభయంతో వణికిపోయిన డేవిడ్‌సన్‌ పక్కనే ఉన్న గదిలోకి పరుగులు తీసి దాక్కున్నాడు. ప్రమాదాం పూర్తిగా తప్పిందని రూఢిగా 36