పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

Insert non-formatted text hereభారత స్వాతంత్య్రోద్యమం ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

1805 నాటి బ్రిటిష్‌ రెసిడెన్సీ చిత్రం. ప్రస్తుతం అది తన రూపురేఖలను మార్చుకుని మనకు నిజాం మహిళా కళాశాలగా హైదారాబాదు కోిటీ సెంటర్‌లో దర్శనమిస్తుంది.

రాయలసీమ యువకులు ఉత్తర హిందుస్థానం వెళ్ళారు. ఈ మేరకు రాయలసీమ ప్రాంతం నుండి పలువురు ముస్లింలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు దారులతో కలసి ప్రథామ స్వాతంత్య్రసంగ్రామంలో పాల్గొనేందుకు ఉత్తర హిందూస్థాన్‌కు వలస వెళ్లారని అప్పటి కడప మెజిస్ట్ర్‌ట్ 1857 న 20న మద్రాస్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. (కడపజిల్లా స్వాతంత్య్రోద్యామంలో కొన్ని ముఖ్య ఘ్టాలు, వ్యాసకర్త డకర్‌ యం.నజీర్‌ అహమద్‌, ప్రచురణó స్వాతంత్ర భారత స్వర్ణోత్సవ సావనీర్‌-రాయలసీమలో


స్వాతంత్య్రోద్యామం, స్వత్రంత్ర భారత స్వర్ణోత్సవ సావనీరు కమి, అనంతపురం, 1998, ¿Ñl.55 =∞iÜ«Ú The Freedom Struggle in Andhra Pradesh (Andhra), Volumes I (18001905 AD), Govt. of AP, Hyderabad, 1997, Page.147) ఈ విధాంగా 1857 నాటి పోరాటంలో బ్రిీషర్ల మీదా తిరగబడిన జనులు, జవానులు చాలా మంది ఉన్నారు. ఆ సాహసుల చరిత్రలు పూర్తిగా నమోదాుకు నోచుకోకపోవడంతో ఆ వివరాలు ప్రజలకు అందకుండ పోయాయి. చరిత్ర పుటలలో మరుగున పడిపోయాయి.

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం తరువాత

1857 చివరికల్లా ఢిల్లీ కేంద్రాంగా సాగుతున్న ప్రథమ స్వాతంత్య్రసమరం విఫలమైనప్పటికీ, ఉత్తర భారతదేశంలో బేగం హజరత్‌ మహల్‌, మౌల్వీ అహమ్మదుల్లాషా లాంటి ప్రముఖ నేతల నాయకత్వంలో, లక్నో, కాన్పూరు, ఝాన్సీ తదితర ప్రాంతాలలో ఎగురుతున్న తిరుగుబాటు బావుటాలను ప్రేరణగా తీసుకుని దేశంలోని పలు ప్రాంతాలలో తిరుగుబాటు ఛాయలు ఇంకా కొనసాగుతూనే వచ్చాయి. 35