పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రాపరదేశ్‌ ముస్లింలు

మక్కా మసీదు

ఈ ఆగ్రహావేశాలు తిరుబాటుగా రూపు దిద్దుకోసాగాయి. ఈ విషయాన్ని పసిగట్టిన ఇంగ్లీష్‌మన్‌ ఆంగ్లపత్రిక 1857 జూన్‌ 27నాటి సంచికలో వెల్లడించింది. హైదరాబాదులో అల్లరులు చెలరేగె గట్టి సూచనలున్నాయి. సైనికులలో అశాంతి ప్రబలి ఉంది. ఇస్లాం మత ధర్మపరిరక్షణ కోసం మతధ్వజం ఎత్తాలని ఉన్నత స్థాయికి చెందిన ఫకీర్లు ముఖ్యంగా ఖామూష్‌ షాహ్‌, అదేపనిగా సైనికుల్లోను ప్రచారం చేస్తున్నారు. ఇక మొల్వీ అక్బర్‌ అనే ప్రచారకుడు మసీదుల్లో ఎడతెరపి లేకుండా ప్రచారం చేసినాడు, అని ఆ పత్రిక పేర్కొంది.

బ్రిటిష్‌ రెసిడెన్సీపై సాహసోపేత దాడి

ఆ ప్రచారానికి తగ్గట్టుగానే 1857 జూలై 17న నగరంలోని ప్రజలు, ప్రముఖులు మక్కా మసీదు వద్ద సమావేశమై, నిజాం వద్దకు నలుగురు మౌల్వీలను పంపి, చిద్దాఖాన్‌ ఆయన అనుచరులను విడుదల చేయమని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ విజ్ఞప్తిని నిజాం నవాబు మన్నించకుంటే బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద దాడి చేయాలని, ఆరోజు జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఊహించిన విధంగానే మౌల్వీల విజ్ఞప్తిని నవాబు మన్నించలేదు. ఆ కారణంగా ప్రజలు దాడికి సిద్దమయ్యారు. ఈ నేపధ్యంలో రొహిల్లా నాయకుడు పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ల సంయుక్త నాయకత్వంలో రొహిల్లా వీరులు, ప్రజలు రెసిడెన్సీ మీద దాడి

31