పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడల్సిందిగా, ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల పెత్తనం నుండి, ఆధిపత్యం నుండి పూర్తిగా విముక్తం కావాల్సిందిగా విజ్ఞప్తులు పంపుకున్నారు.

ఈ కదలికకు ఉత్తర భారతదేశంలో ప్రారంభమైన తిరుగుబాట్లు ప్రేరణగా నిలిచాయి.పరాయి పాలకుల మీద సమరం సాగించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న పోరాటశక్తులు తక్షణమే ఆయుధాలను చేపట్టి బ్రిటిష్‌ పాలకులను సవాల్‌ చేశాయి. శతృవును ఎదుర్కొనేందుకు హిందూ-ముస్లింల ఐక్యత కాంక్షిస్తూ ప్రజలను పోరాటం దిశగా సాగమని ప్రతి ఒక్కరిని కోరాయి. ఆ ప్రయత్నాలలో భాగంగా సాగిన విజ్ఞప్తులకు స్పందించని నిజాం నవాబును హేళన చేస్తూ తిరగబడమంటూ, కాదు కూడదంటే గాజులు తొడుక్కొని కూర్చోమని ప్రకటనలు, ప్లేకార్డులు ఈ క్రింది విధంగా హైదారాబాదు నగరంలో వెలిశాయి.

బహుదూర్‌ అఫ్జలుద్దౌలా మీద భగవంతుని, మహమ్మద్‌ ప్రవక్త దయ ఉంది. ఆయన భయపడకుండా ఉండాలి. ఒకవేళ భయపడినట్టయితే గాజులు తొడుక్కొని ఇంటి దగ్గర కూర్చోవడం మంచిది ... ఈ పోస్టర్లలో రాసిన ప్రకారంగా బహుదూర్‌ ప్రవర్తించ నట్టయితే ఢిల్లీ నుండి ఇంకొక సుభా వస్తుంది, (నిజాం-బ్రిటిష్‌ సంబంధాలు (1727 -1857), సరోజినీ రెగానీ, మీడియా హౌస్‌ పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌, 2002, పేజి. 319-320)

ఈ పరిస్థితి ఎంత దూరం పోయిందంటే, ఈ వినతిని చదివిన వ్యక్తులుగాని, ఈ విషయం తెలుసుకున్న ఎవరైనా గాని ప్రకటించిన మేరకు నిజాంకు, ఆయన దివాన్‌కు ఆ విషయం తెలుపకున్నా, ఈ ప్రకటనలను ఇక్కడి నుండి తొలగించినా అటువంటి వారు దేవుడు, ప్రవక్త శాపానికి గురవుతారని కూడ హెచ్చరించేంత వరకు వెళ్ళింది. ఈ రకమైన ప్రకటనలలో వెలుబుచ్చిన అభిప్రాయాలను గమనిస్తే ప్రజల పట్టుదల, ఆగ్రహం ఏస్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. " The aid of the Almighty and his prophet is present with Afzal-ud-Doula Bahadur who should not fear and be apprehensive. If fearful he should wear bangles and sit at home..... If AfzulooDowla does not act on this paper, another Soobah will be ready form Delhi...If after reading these papers on hearing it a representation is not made to the king (Nizam) or his Diwan, ....the oath of the swine is on him and if in case of a Hindu the oath of cow...if this paper removed from this place the cures of God and his prophet will rest on the person removing it..." (Highlights of the Freedom Movement in Andhrapradesh - The Freedom Struggle In Hyderabad, Volume II (1857-1885), Govt. of AP, 1956, Page. 8-9)

ఈ ఆహ్వానాలు, ప్రజల విజ్ఞప్తులు నవాబుకు ఏమాత్రం పట్టలేదు. బ్రిటిషర్లు మాత్రం ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించారు. సంపన్నవంతమే కాకుండా ఓ బలమైన

26