పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆరంభమైంది. బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాలకు పుట్టినిల్లు అయినటువంటి బెంగాల్‌ నుండి తొలుత వహాబీలు విజృంభించారు. మత సంబంధిత పవిత్రత, స్వచ్ఛతను కాపాడే ఉద్దేశ్యంతో వహాబీలు తొలుత ఉద్యమించినా, చివరకు ప్రజా బాహుళ్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈస్ట్‌ ఇండియా కంపెనీ మీద, కంపెనీ తాబేదార్లపై తిరగబడక తప్పలేదు. ఆ క్రమంలో బ్రిటిష్‌ వ్యతిరేకతను పూర్తిగా వంట బట్టించుకుని సాగిన వహాబీ ఉద్యమం ఆ తరువాత పలు చారిత్రాత్మక సంఘటనలకు, ప్రఖ్యాతి చెందిన విచారణలకు కారణమైంది.

ఈ విధంగా సాగుతున్నప్రజాపోరాటాలు తెలుగుగడ్డ మీదగల సామాన్య ప్రజలను, ప్రభువులను ప్రభావితం చేయకపోలేదు. ఆత్మగౌరవం గల ప్రజలు, ప్రభువుల సంబంధితులు వలసపాలకుల వ్యతిరేకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఆరంభించారు. ఈ ఆగ్రహం అతి త్వరిత కాలంలో తిరుగుబాటుగా పూర్తి స్థాయిలో ప్రదర్శితమయ్యింది.

విశాఖపట్నం గడ్డ మీద సిపాయిల తొలి తిరుగుబాటు

ఉత్తర హిందూస్థానంలో నిలదొక్కుకున్న ఆంగ్లేయులు దక్షిణ భారతదేశాన్నికూడా పూర్తిగా తమ అధీనంలో తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాలను దక్షిణాదిలో మైసూరు రాజ్యాధినేత హైదర్‌ అలీ చాలా దృఢంగా ఎదుర్కొన్నారు. ఆయనను ప్రతిఘించడానికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఎన్నో నాటకాలు ఆడాల్సివచ్చింది. ఇటు మరాఠాలను, అటు నిజాంను తోడుతెచ్చుకోవాల్సి వచ్చింది, కుట్రలు చేయాల్సి వచ్చింది.

అనాటి మైసూరు అధినేత హైదర్‌ అలీ బ్రిటిష్‌ వ్యతిరేక ప్రయత్నాలకు దక్షిణాదిలోని స్వదేశీ పాలకులు అనుకూలంగా స్పందించకపోయినా, ఆయన సాహసకృత్యాలు, సాధించిన విజయాలు మాత్రం స్వదేశీపాలకుల సైన్యంలోని భారతీయులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ ప్రభావం నుండి తెలుగు గడ్డమీది స్వదేశీసైనికులు కూడా మినహాయింపు కాలేదు. దక్షిణాదిన ఎక్క డ ఉన్నాశతృవును దునుమాడుతూ అప్రతిహతంగా సాగు తున్నమహాయోధుడు హైదర్‌ అలీ పోరాట గమనాన్నిగమనించసాగారు.

ఈ నేపథ్యంలో 1780 ప్రాంతంలో మద్రాసు దాకా బ్రిటిషర్లను తరుముకొచ్చిన హైదర్‌ అలీని ఎదుర్కొనేందుకు ఆంగ్లేయులకు మరింత సైన్యం అవసరమైంది. విశాఖపట్నం, మచిలీపట్నంలలో ఉన్న తమ ప్రధాన సైనిక స్థావరాల నుండి సైన్యాలను మద్రాసుకుతరలించేందుకు స్థానిక సైనికాధికారులకు ఆజ్ఞలు అందాయి. ఆ ఆజ్ఞలను మచిలీపట్నంలోని సైన్యాధికారులు, సైనికులు తు.చ తప్పక పాటించారు. విశాఖపట్నంలోని భారతీయ సైనికులు మాత్రం ధిక్కరించారు. మద్రాసు వెళ్ళి హెదారఅలీ మీద పోరాడాలని జారీ అయిన ఆదేశాలను స్వదేశీ సైనికులు ఖాతరు చేయకపోగా ఆంగ్లేయాధికారుల మీద తిరగబడ్డారు.

20