పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

1765లో మొగల్‌ ప్రభువు షా ఆలం నుండి దివానిని చేజిక్కించుకుంటున్న రాబర్ట్‌ క్లయివ్‌

విజయావకాశాల మూలంగా మొగల్‌ పాదుషాల మీద ఒత్తిడి పెంచి 1765లో మొగల్‌ ప్రభువు షా ఆలం నుండి బెంగాల్‌ దివానిని ఈస్ట్‌ ఇండియా కంపెనీ కైవసం చేసుకుంది. ఆనాటి నుండి భారతీయుల మీద బ్రిటిష్‌ వలసపాలకుల పెత్తనం పూర్తిగా స్థిరపడ సాగింది. ఈవిధంగా లభించిన పెత్తనం ఆసరాగా అన్నివర్గాల ప్రజలను, స్వదేశీ ప్రభువులను ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, ఆంగ్లేయ అధికారులు దోచుకోవటం ఆరంభించారు.

తొలినాటిప్రజాపోరాటాలు

ఈ దోపిడి వాతావరణం ప్రజల జీవితాలను అతలాకుతలం చేయడంతో 1763 ప్రాంతంలో బెంగాల్‌ లోని ఫకీర్లు-సన్యాసులు కలసి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల మీద ధ్వజమెత్తారు. ప్రజల అండదండలతో పొగలు సెగలు కక్కిన ఫకీర్లు-సన్యాసుల తిరుగుబాటు మజ్నూషా ఫకీర్‌ నేతృత్వంలో ఆరంభమై 1800 వరకు సాగింది. అనంతరం 1820 ప్రాంతంలో పీర్‌ షరియతుల్లా నేతృత్వంలో బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమం తిరిగి ప్రారంభమైంది. ఈ ఉద్యమం ఫరాజీ ఉద్యమంగా ఖ్యాతి గాంచింది. ఈ పోరాటాలన్నీ బెంగాల్‌, బీహార్‌ తదితర ప్రాంతాలకు పరిమితమైనాయి.

ఆనాడు ఫకీర్లు-సన్యాసులు, ఫరాజీ ఉద్యమకారుల బాటలో ప్రారంభమైన మరొక మహోద్యమం వహాబీ ఉద్యమం. ఈ ఉద్యమం ఫరాజీలు తిరుగుబాటు చేసిన కాలంలోనే

19