పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఈ పోరులో అశేష హిమాచలం ఎలాగైతే నడుంకట్టి కదనరంగానికి కదలి వచ్చిందో అదే విధంగా ఆంధ్రావని కూడా పొటెత్తిన సముద్రంలా త్యాగాల బాటలో ముందుకు సాగింది. పరదేశీయుల పీడనను వదిలించుకునేందుకు భారతీయులంతా ఏకోన్ముఖంగా పోరుబాటలో సాగుతున్న సమయంలో ఆంధ్రులు ఆ మార్గాన్నే ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తెలుగుగడ్డ మీద పుట్టి పెరిగిన ముస్లింలు తరతరాలుగా కలసి మెలసి సహజీవనం సాగిస్తున్న సోదర సమానుల దారినే ఎంచుకున్నారు. ముస్లిమేతర జనసముదాయాలలోని స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి ముందుకు నడిచారు. చివరికంటా ఆంగ్లేయ వలస పాలకులతో పోరాడి భారత స్వాతంత్య్రసంగ్రామంలో తమవంతు భాగస్వామ్యాన్నిఅందించారు.

ఈ మేరకు స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన మహత్తర పాత్రకు అంతర్గత, బహిర్గత కారణాలు, జాతీయ స్థాయి పరిణామాల మూలంగా చరిత్రలో లభించాల్సినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రచారం లభించలేదు. ప్రామాణిక చరిత్ర గ్రంథాలలో తగిన స్థానం లభించక పోవడం వలన సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలలో ముస్లింల త్యాగాలకు సంబంధించిన ప్రస్తావనలు అంతగా అగుపించవు. ఈ దౌర్భాగ్యం వలన ఈ జనసముదాయాల చారిత్రక భాగస్వామ్యం జనబాహుళ్యానికి పూర్తిగా చేరలేదు. ఆ కారణంగా ఆనాటి అపూర్వ ఆత్మార్పణలు, త్యాగాలు చరిత్ర గర్భాన మరుగున పడిపోయాయి.

తొలి సమరశంఖారావం

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం నిమిత్త భరత గడ్డ మీద అడుగు పెట్టిన ఆంగ్లేయులు తిన్నగా స్వదేశీ ప్రభువుల ప్రాపకం సంపాదించారు. అనుమతులు పొందేందుకు అంగీకరించిన షరతులను ఉల్లంఫిుంచారు. దుశ్ఛచర్యలను సహించ లేని బెంగాలు నవాబు సిరాజుద్దౌలా తొలిసారిగా ఆంగ్లేయుల మీద 1757లో పోరాటం ప్రారంభించారు. స్వజనుల నమ్మకద్రోహం కారణంగా బెంగాల్‌లోని ప్లాసీ అను గ్రామం వద్ద కంపెనీ సైన్యాలతో జరిగిన యుద్ధంలో సిరాజుద్దౌలా పరాజయం పాలయ్యారు.

ఆ విధంగా లభించిన విజయంతో తమ పునాదులను గట్టిపర్చుకోచూసిన ఆంగ్లేయులకు ఆ తరువాత మరో పోరాట యోధుడు మీర్‌ ఖాశిం అడ్డుతగిలారు. 1764లో బక్సర్‌ వద్ద ఆంగ్లేయులతో ఆయన తలపడ్డారు. అంగబలం, అర్థబలంతోపాటుగా, విభీషణ మనస్తత్వం గల కొందరు స్వదేశీ పాలకులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాలకు అండగా నిలవడంతో ఆ యుద్ధంలో ఆంగ్లేయులు విజయం సాధించాయి. ఈ విజయంతో ఆంగ్లేయులు పూర్తిగా ఉత్తర హిందూస్థానంలో బలపడ్డారు. ఈ విధంగా లభించిన

18