పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
భారత స్వాతంత్య్రోద్యమం
ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు
భారత స్వాతంత్య్రోద్యమం
ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు


బ్రిటిష్‌ బానిస బంధనాల నుండి విముక్తిని కోరుకుంటూ, వజ్రసంకల్పంతో, అద్వితీయ పోరాటపటిమతో భారతీయులు సాగించిన స్వాతంత్య్రోద్యమం ప్రపంచ పోరాటాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహత్తర ఘట్టం. ఈ మహోద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు జాతి, కుల, మత, వర్గ భేదాలను మరచి స్వరాజ్య సాధన మాత్రమే అంతిమ లక్ష్యంగా పాల్గొన్నారు.

భిన్నత్వంలోలో ఏకత్వం-ఏకత్వంలో భిన్నత్వం, అంతర్గత మార్గదర్శక సూత్రంగా సాగుతున్న భారతీయ సాంఫిుక జనసముదాయాలలో ఒకటైన ముస్లిం జనసముదాయం సోదర జనసమూహాలతో కలిసి మెలసి ఈ పోరులో క్రియాశీలకంగా పాల్గొంది. అది శాంతిపథమైనా, విప్లవమార్గమైనా ఆత్మార్పణలకు ఏనాడు వెనుకడుగు వేయలేదు. మాతృభూమి పట్లగల అవ్యాజ ప్రేమాభిమానాల ఫలితంగా ధాన మాన ప్రాణాలను పణంగా పెట్టి సోదర సమానులతో కలసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అసమాన త్యాగాలతో అమరులయ్యారు. అద్బుతమైన విజయాలను సాధించారు. అపూర్వ త్యాగాలు, అద్వితీయ సాహసాలతో బ్రిటిష్‌ వలస పాలకులను స్వదేశం నుండి పారద్రోలి స్వదేశీయుల పాలన సాధించుకోవడంలో మహత్తర పాత్ర నిర్వహించారు.

17