పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారణంగా సామాన్య పాఠకులకు ఇబ్బంది కలిగించే, పఠనశీలత స్వభావానికి అవరోధం కల్గించే బుక్‌ స్టైయిల్‌ విధానాలను అనుసరించలేదు. 'చరిత్ర జ్ఞానం ప్రజాస్వామీకరించబడాలి' అంటే అది సామాన్య పాఠకుడ్ని కూడా ఆకట్టుకుని చదివించేలా, చదివిన విషయాన్ని పాఠకుడు సులభంగా గ్రహించగలగాలన్న ఆలోచనతో నాదైన పద్ధతిని అనుసరిస్తూ వచ్చాను. ఈ పద్ధతి మీద తీర్పును పాఠకులకు వదిలేశాను.

స్వాతంత్య్రోద్వమంలో భాగస్వాములైన వ్యక్తిల చరిత్రకు నంబంబంధిం చిన విషయాలను, సమాచారాన్ని నేరుగా ఆ వ్యక్తుల నుండి, ఆ వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యక్తుల కుటుంబీకులు, సహచరులు, సన్నిహితుల నుండి, ఆ తరువాత సమకాలీన రచయితల గ్రంథాల నుండి, చరిత్రకారులు శోధించి, సాధించి అక్షరబద్ధం చేసిన గ్రంథాల నుండి సేకరించటం జరిగింది. ఈ గ్రంథం కోసం పై విధంగా నాకు అందుబాటులోకి వచ్చిన అన్ని ఆధారాల నుండి కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నాను. ఆ విధంగా లభించిన సమాచారం ఆధారంగా ఈ పుస్తకం రూపొందింది కనుక ఆ వ్యక్తులు, ఆ గ్రంథాలు, ఆపత్రికల జాబితాలను కూడ పాఠకుల ఎరుకలో ఉంచడానికి ఆధార గ్రంథాలు-పత్రికలు అను శీర్షిక క్రింద నేను సంప్రదించిన గ్రంథాల, పత్రికల జాబితాను ఇచ్చాను. ఈ గ్రంథంలో ప్రచురితమైన కొన్నిఫొటోలు, చిత్రాలు పలు గ్రంథాల నుండి, పత్రికలు, వెబ్‌సైట్ల నుండి తీసుకున్నందున, ఆ జాబితా కూడ జతచేశాను.

నా ప్రయత్నాన్ని అభినందిస్తూ, నా కృషిని ఆహ్వానిస్తూ ఎంతో మంది పెద్దలు, మిత్రులు, సన్నిహితులు సమాచార సేకరణలో నా శ్రమను తగ్గించేందుకు తాము స్వయంగా రంగంలో దిగి నాకు అవసరమగు చాలా సమాచారాన్ని, తగిన చిత్రాలను, ఫొటోలను సేకరించి నాకు పంపి సహకరించారు. అటువంటి పెద్దల, మిత్రుల, సన్నిహితుల జాబితాను కూడ ప్రకించడం నా బాధ్యతగా భావించాను. ఆ కారణంగా ఆ జాబితాను ప్రత్యేకంగా నా ధన్యవాదాలతో సమర్పించుకున్నాను.

చివరకు ఈ గ్రంథం రూపుదిద్దుకోవడంలో తమ ఆర్థిక-హార్థిక సహకారం అందించిన సహృదయులు జనాబ్‌ సర్వర్‌ అలీ ఖాన్‌ (హైదారాబాద్‌), జనాబ్‌ షేక్‌ బాషా మొహిద్దీన్‌ (వెంకటరంగాపురం), డాక్టర్‌ యండి. రఫి (హన్మకొండ), డాక్టర్‌ కె.యల్‌ కుట్టీ (నెల్లూరు), పరిచయవాక్యం రాసిచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రోపన్యాసకులు ప్రోఫెసర్‌ అడపా సత్యనారాయణ గారికి, చక్కని ముఖచిత్రం తయారు చేసి ఇవ్వడమే కాకుండా, పుస్తకాన్నిమరింత అందంగా తీర్చిదిద్దడంలో సహకరించిన ప్రముఖ చిత్రకారులు షేక్‌ అబ్దుల్లా సాహెబ్‌ (విజయవాడ), యన్‌.జయరాజ్‌ (వినుకొండ), ఈ పుస్తకంలోని కొన్ని చిత్రాలను, ఫొటోలను మరింత అందంగా రూపొందించి ఇచ్చిన ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్‌ (వినుకొండ), నా ప్రతి పుస్తకాన్ని ముందుగా చదివి తగిన సలహాలు-