పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమాత్రం తీసిపోకుండా ముస్లిం కుటుంబాలు, ముస్లిం మహిళలు కూడా నిర్వహించిన పోరాట కార్యక్రమాలు, ఆ పోరుబాట సాగిన రాజకీయ పక్షాలకు ఆ మహిళామ తల్లులు ఎంతగా సహకరించారన్నది ఈ కథనాల ద్వారా బహిర్గతమøతుంది. ఆ విశేషాంశాలన్నీ పాఠకులకు అందివ్వాలని ఆ విశేషాలను ఇందులో విస్తారంగా పొందుపర్చాను.

ఆ తరువాత స్వాతంత్య్రసమర స్పూర్తితో సాగిన ప్రజాపోరాటాలలో పాల్గొని చరిత్ర సృష్టించిన ప్రజా పోరాటయోధుల జీవిత రేఖాచిత్రాలను మూడవ భాగంలో ఇచ్చాను. ఈ భాగంలో ఉన్న యోధులు అటు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన ప్రజా పోరాటాలలో అంతకంటె ప్రధాన పాత్ర వహించినందున వారి వివరాలను ప్రత్యేకంగా అనుబంధం-2 శీర్షిక క్రింద వర్గీకరించి ప్రత్యేకంగా సమర్పించాను.

ఈ గ్రంథంలో స్వాతంత్య్రసమరయోధుల జీవిత రేఖాచిత్రాలలో ఆయా యోధుల జీవిత విశేషాలను చాలా వరకు సమగ్రంగా సమకూర్చేందుకు ప్రయత్నం చేశాను. కొంత మందికి సంబంధించిన వివరాల కోసం ఎంతగా ప్రయత్నించినా నాకున్న పరిమితుల వలన పూర్తిగా సమకూర్చుకోలేకపోయాను. ఆ కారణంగా అవసరమైన సమాచారం లభించని ఆ యోధుల వివరాలను కూడా పుస్తకంలో పొందుపర్చాలన్న ఉద్దేశ్యంతో, పలు గ్రంథాల నుండి, స్వాతంత్య్రోమ చరిత్రతో పరిచయం ఉన్న పలువురి నుండి సేకరించిన సమాచారాన్ని నాల్గవ భాగంలో జిల్లాల వారిగా సంక్షిప్తంగా సమకూర్చాను. ఈ సమాచారాన్ని, అనుబంధం -3 శీర్షిక క్రింద పేర్కొన్నాను. అనుబంధం 1, 2 లలో వచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల ప్రస్తావన అనుబంధం -3లో చాలా క్లుప్తంగా పునరావృతం అయినప్పటికి, ఆ విశేషాలు ఇతర అనుబంధాలలో వివరంగా ఉన్నాయన్న విషయాన్ని పాఠకుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా సూచించాను.

ఈ గ్రంథంలోని అతి ముఖ్యమైన సమాచారాన్ని ఇతర గ్రంథాల నుండి గ్రహించి, ఆ సమాచారాన్ని ఉటంకిస్తునప్పుడు సామాన్య పాఠకులకు చిరాకు కలిగించకుండేందుకు నాదైన బుక్‌ స్టైయిల్‌ ను అనుసరించాను. ఆ వాక్యాలను 'కోట్-అన్‌కోట్' చేయడం కాకుండా వాటిని బోల్డు చేశాను. ఈ విధంగా బోల్డు చేసిన వాక్యాలన్నీ ఇతర గ్రంథాల నుంచి గ్రహించినవిగా గుర్తించాల్సిందిగా పాఠకులకు మనవి. ఈ వాక్యాలు, సమాచారం ఏ, ఏ గ్రంథాల నుండి సేకరించడం జరిగిందో ఆ వివరాలను ఆ వాక్యం చివర్నే ఇచ్చాను. ఈ విధంగా ఎక్కడికక్కడ రిఫరెన్స్‌ ఇవ్వడం వలన సామాన్య పాఠకుడితోపాటుగా ఆసక్తి గల ఇతర రచయితలకు కూడా ఆ సమాచారం ఉపయుక్తం కాగలదని భావిస్తున్నాను. ఆ కారణంగా ప్రతి స్కెచ్‌ చివర్న పాదసూచికలు ఇచ్చే పద్ధతులను పాటించలేదు.

నా పుస్తకాలు పరిశోధానాత్మక గ్రంథాల సరసన చేరి అవి పండితుల పరామర్శ వరకు మాత్రమే పరిమితం కాకుండా సామాన్య పాఠకుని చెంత చేరాలన్నది నా ఆశ. ఆ