ఆది పర్వము. మ. వనితారత్నమ నీపయిం డవిలె నా భావంబు త్రిప్పంగ లే ననుమానింపక న స్వరింపఁ గడ వేశాయజ్ఞాటి ! రాజర్షినం దన వంచు న్విని మోద మందితిని గాంధర్వంబు శ్రేష్ఠంబు గా వున నీ వ ట్లొనరింపు మం చనియు నయ్యుర్వీశ్వరుం డవ్వలక్. క. తరుణీరత్నమ! యీడు, ర్భర కావల నుండ నేల పరిణయ మై నా ధరణీసామ్రాజ్యంబును, బరిపాలన సేయ రాదె పడతులు గొలువన్. క. నీసౌందర్య మపూర్వ మి, డేను తులయందు నుండ దిందునిభాస్యా 11 92 93 గా సిల్లఁ జేయకుము నీ దాసుఁడ సీవాఁడ నన్ను డయఁ జూడఁగ దే. తే. త్రిజగమును నిజకాంతిచే: దేజరిల్లు, సాటిలేని సౌ కర్యము సాటిలేని పరమసాధ్వీమహత్వము పరఁగ నీవు, వనులయం దుండఁగా నేల వనరుహాస్య. శా. కాంతారత్నమ! పుష్పబాణు గెలువంగాఁ జాల న న్గావు మ త్యం తేష్టం బగు నీదు కోరికెను నేతన్మాత్రలోఁ దీర్తు నీ చెంతం జేరితి దివ్యభూషణములం జెల్వారఁగా నిచ్చెదన్ స్వాంతంబందలికోర్కి దీర్పఁగ నాసామ్రాజ్య మే నీ దగున్ 94 96 97 క. అని దుష్యంతన రేంద్రుం డనిన శకుంతల వచించె నాతనితో నో జననాయక ! కణ్వమహా, ముని నను నీకొసఁగునెడల మోదమె నాకు. వ. అని మిగులవగలం గులుకుచుఁ బలికిన శకుంతలకు దుష్యంతుం డిట్లనియె. 98 చ మరునిశితాస్త్రపాతమున మ్రగ్గుచు నుంటిని దాళ్య జాల మేక్ దొరఁగెడునో యటంచు మదిఁ దోఁచుచు నుండె స్వతంత్ర వివ యో తరుణి! నను స్వరించి పరితాపముఁ దీర్పు మటంచు వేఁడఁగా సరసిజచారులోచన శశాంకకులీ కునితోడ ని ట్లనున్. చ. జనవర! నీదుకోరికను సమ్మతిఁ దీర్చెద నాకుఁ గల్గునా తనయుఁడు నీదు రాజ్యమునఁ దప్పక రాజుఁ జేయునట్లు బా సను బొనరింపు మంచు మృగశాబవిలోచన పల్కినంత ని ట్లనియె మహీతలేంద్రుఁడు నిజాత్మను గౌతుక ముప్పతిల్లఁగన్. క. నీకోరినతీఱుననే, నీకొమరుఁడు రాజ్యలక్ష్మి నిశ్చయముగఁ దాఁ గైకొని పరిపాలించును, నా కోరికిఁ దీర్పు మింక నలినదళాక్షీ. క. అనిన శకుంతల లజ్జా, ననమున నంగీకరింప నరనాయకుఁ డా వనజాక్షిని గాంధర్వం, బునఁ బ్రాణిగ్రహణ మపుడు పొనరించెఁ దగన్. వ. అంత దుష్యంతభూకాంతుండు జగదేకసుందరి యగుశకుంతలా కాంతం బరి 99 100 101 102
పుట:భారత కథామృతము.djvu/34
స్వరూపం