Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశ్రమవాపపర్వము, ద్వితీయాశ్వాసము. తేజు సత్యవతీతనూజు ము న్నిడికొని యప్పు డమునిపతి యతనితోడ తే. నీవు వేదశాస్త్రార్థముల్ భావితాత్ము, లగుమునీంద్రులచేఁ జెవులార వింటి కంటి తనయులనీకన్న కంటెనొప్పి,యుండుదురు వారు దివి సౌఖ్యయోగ మెసఁగ. ఉ కావున నింక 'వారికయి కౌరవసత్తమ యుమ్మలింకు కా తావిలభావముం దపమునగ్గలికం బెడఁబాపు నిన్ను సం భావనఁ గొల్చి యొక్క నెల పాండవముఖ్యుఁడు నిళ్చె నిష్ఠమై వీవనభూమి నీవసుమతీశ్వరుఁ బొమ్మనఁ గాదె వీటికిన్. 131 వ. అని చెప్పిన నప్పారవో త్తముం డట్ల చేసెద నని పలికి యమునిస తమునకుం బ్రణమిల్లి భవదీయకృపావి శేషంబునం గృతార్థుండ నైతి నని యతని నామం త్రితుం జేసినం బాండవులుం దగ నప్పరమముని వీడ్కొని రయ్యందఱును దీ వించి యమ్మహత్యుం ఉంతర్హితుం డయ్యెఁ దదనంతరంబ. సీ. అంబికేయుండు ధర్మాత్మజుఁ జిత్తసం ప్రీతి మోమునఁ దోడయుఁ జేరఁ బిలిచి వసుమతీ కార్యనిర్వహణంబు పెద్దకొల్వున నుండి నీ వనుదినము నడప కునికి కర్తవ్యమే వినుకులు భీష్మాదిమిహితులచేత సమగ్ర భావ 182 మొందినయవి యింక నుపదేశ మేమియు వలవదు ఆంధ్ర మొవ్వనిజనంబ తే. వేచు ననుజానుగతుఁడ పై వేగ పొమ్మ, దారయుతముగఁ బురికి నుదారచరిత నీకతంబున మున్న నా శోక మెల్లఁ, బాసెఁ దేజంబు సౌఖ్యానుభవముఁ గంటి. చ. తపము నేడూ మదీయమతి తత్పర గావున దాని కోర్టు నీ వపగత భేదమానసుఁడ పై నను నిం దతినిష్ఠ నొందఁ బం చి పురజనంబు సమదముఁ జెందఁగ సైనికు లుల్లసిల్లఁగా నృపవర యేఁగి రాజ్యభరనిర్వహణం బొనరింపు నావుడున్. ధర్మ తనూజుఁ డాతనితోడ ని ట్లను నధిప భీమాదుల నరుగఁ బనుపు పుడమి రక్షింప నీయడుగులకడ నేను నిలిచి మాతల్లుల నిన్నుఁ గొలిచి యంచితతపమున కనుగుణం బైనట్టి శుశ్రూషణము సేయుచును దపోని యతితోడ నుండెద ననవుడు గాంధారి యి ట్లనఁ దగునన్న యీప కాదె తే. కురుకులమునకు సంరక్షకుఁడవు నీవు తండ్రులకుఁ బిండ 'మొసఁగఁ గర్తవు భవజ్ఞ నకునిపంపు సేయుము భూజనము దలంక కుండఁ బొ మ్మది ప్రియము మాయుల్లమునకు. వ. అని పలికిన నప్పాండవాగ్రజుండు పాండురాజా గ్ర మహిషితో నిట్లనియె. ఆ. ఇట్లు మీరు నన్ను నెంతయుఁ దఱిమిన విపినభూమి మిము విడిచి పోవ నియ్యకొనదు నాదుహృదయంబు మునువో లెఁ 1 వాశలకుఁ గౌరవం తమం. 2 విమ శుకు కుకుభీపాలి. 3 మోశ్వనిజరంబు. 184 186