246 శ్రీ మదాంధ్ర మహాభార త వ. ఇట్లు వచ్చి సకలబంధుజనంబులకుం బరమ ప్రమోదం బావహిల్లం గలసి సముచితాచారంబులు నడపి రా రెండు దెఱంగులవారలు నిర్హ ప్రకారంబులం బితామ హాచార్య శిష్యమాతృమాతామహ పితృపితామహ భ్రాతృజామా తృపుత్రపుత్రీ భగినీ పాత్ర దౌహిత్ర శ్వశురశ్వచూస్ను షామాతులస్యాలక ప్రియ ప్రియా మిత్రసమాగమసుఖంబు లనుభవించుచు. తే. అనఁగి పెనఁగి నాఁడెల్ల నిచ్చాను రూప వృత్తి వర్తిల్లు చుండి రవ్విధము సకల జనుల నద్భుతరసమున మునుఁగఁ జేసె 'నే మనఁగ వచ్చు నాసంయమీంద్రు మహిమ. 125 126 వ. మఱునాఁడు రేపకడ యప్పారాశర్యుండు వనుప నయ్యిగు దెఱుగులవారలు బరస్పరామంత్రణంబు సేసి రాళూ రజనంబులు దమతమలోకంబులకుం జను వారై జాహ్న వీజలంబులం బ్రవేశింప నన్ని లింపవందనీయుండు దానును జొచ్చి యచ్చటనుండి పతులు ననుగమింప వలసినయంగనలు గంగాతోయం బులం గ్రుంకుటకు రం డనిన విని విధవ లగు వీరభార్యలెల్లను ధృతరాష్ట్ర గాంధారీకుంతీధర్మ నందనులయనుజ్ఞులు గొని రయంబునం జని భాగిరథీ సలిల మగ్నలై మానుష దేహంబులు విడిచి దేవతనువులు దాల్చి దివ్యాలం కార సమలంకృతమూర్తు లై మగలం గలసి రవ్విశేషంబు సూచి సర్వజనులు సత్యం తాశ్చర్య సంతోషాధీనమానసు లై రని చెప్పి వైశంపాయనుండు జన మేజయున కి ట్లనియె. 127 సీ జననాథ యీప్రియ సంగమోత్సవకథ వినినఁ బఠించిన వేవిధములఁ 'బరమప్రియము లిందుఁ బరలోకమున సంభవించు మనమున కించుభంగి బాంధవయోగశోభనము వర్ధిల్లు ననాయాసమున నామయాపగమము గలుగు భూదేవనికాయంబునకు దీనిఁ దగఁ వినిపించిన ధార్మికులకు తే. నవ్యయానందసంప్రాప్తి యావహిల్లుఁ, దత్పరతఁ గొనియాడిన దైవతములు నీచదశఁ బొంద కుండంగఁ గాచి తిరిగి, మే లొనర్తురు భరతభూపాలవర్య. వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనుతో ధృతరాష్ట్రం డట్లు కృష్ణద్వై పాయన ప్రసాదలబ్ధం బైసతత్కాలకలితదృష్టివిశేషంబున బంధులోకంబు నాలోకించి మఱి యేమివర్తనంబున నుండెఁ బాండవు లెట్లు వర్తించి రాణిం గింపవే యనుటయు నతనికి నతం డి ట్లనియె ఆ ధృతరాష్ట్రుడు భాగీరథీ తీరంబుననుండి నిజాశ్రమంబు ప్రవేశించుట. నీ. 'అయ్యద్భుతపువృత్త మమ్మెయి: జెల్లిన ధృతరాష్ట్ర మేదినీపతి తపస్వి గణము సవినయంబుగా నిజస్థానయానమునకు నామంత్రితముగఁ జేసి యా శ్రమభూమికి సరిగెఁ దోడన పాండురాజనందనులును రా సుదాత్త 1 రమ ప్రియము లొండుఁ బరలోకమును సంభవించు మనమున. 2 అత్మ అత్యద్భుతపు. 129
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/655
స్వరూపం