Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

388 శ శ్రీ మదాంధ్ర మహాభారతము శ్రీ 58 గ్రక్కున నప్పుడ విదుకుం, డక్కౌం తేయాగ్రజున కనతిదూరమునన్. వ. కాంతారధూళి మలినాంగుండును జటీభూత కేశ పాతుండును దిగంబరుండును విదురుం డట్లు దోఁచి యయ్యాశ్రమంబున నున్న జనంబులం గని మగిడి పోవం జూచి ధర తనయుండు దనయనుచరుల నిలువుం డనుచుఁ దా నొక్కరుండును సత్వరంబుగా నవ్వి నుత ప్రభావునివెరుకం జనియె నతండు గులాంతరితుం డగు చుం దోఁచుచుఁ బోవం బోవ నప్పాండవాగ్రజుం డెలుం గెత్తి యోవిదుర యో విదుర నిలు నిలు మేము యుధిష్ఠిరుండ నిన్నుఁ గాన వచ్చితి నని పలుకుచుం బాఱిన నమహాత్తుండు మరలి కనుంగొని వివి కప్రదేశంబున నొక్క పాదపంబ నేరి నిలిచిన. అ విదుగుఁడు యోగమార్గంన ధర్మరాజునందుఁ గలయుట. సీ ధర్మతనూజుండు దత్సమానంబున కేఁగి యయ్యోగికట్టెదుర నిలిచి 95 యాతండు నయనంబు లర్ధమీలితము లై యుండంగ నూరకయున్నఁ గాంచి నిర్మలాత్మక యేను ధర్మ సూనుఁడ పన్నుఁ గను విచ్చి చూడవే యనుడు నతఁడం తెప్పల నెగయించి యప్పాండలో తముఁ దప్పక చూచి యుదాత్తయోగ తే. బలము గైకొని యింద్రియములను బ్రాణ ములను నిం శ్రియములుఁ బ్రాణములును గలపి నిజశరీరంబు విడిచి యానృపతితనువు సొచ్చెఁ దేజోమయత్వవిస్ఫూర్తి మెఱయ. 00 ఆ. వినుము ధర్మ పుత్రుతను వునఁ గాంతియు, లావు నప్పు డగ్గలంబు లయ్యె నొలనె బుద్ధి యధికబల మట్టు లగు టతఁ డెఱిఁగి చోద్యమందియెలమినొందె. క. తదనంతరంబ యప్పతి, విదురశవము మ్రాను సెంది వికృతరహిత మై నిదురమెయి నొఱగి యున్న పగిది నుండం జూచి యగ్ని కృత్యము నడపన్. 62 చ. తలఁచిన మింట నొక్కెలుఁగు ధర్మ తనూజ యతిత్వగౌరవో జ్జ్వలునిక ళేబరంబునకు వహ్ని విధాన మొనర్చు టర్హ మే వల దని మ్రోసె నమ్మునుజవల్లభుఁ డప్పని దక్కి పోయి భ్రా తలకును దండ్రికి సువిదితంబుగ నంతయునుం గ్రామంబునన్ 63 వ. ఎల్ల వారును విను చుండం జెప్పిన నందఱు నద్భుతరసంబున మునింగిరి పదంవ డి ధృతం ష్టం డామంత్రణంబు సేయ మునిజనులు నిజనివాసంబులకుం జనిరి తదనంతరం బ యాంబి కేయుండు ధర్మనందనునితోడ. leol 64 సీ. భరతకులో శ్రమ ఫలమూలముల నుపయోగింపు యొసఁగెద మొదవి తమకు నెయ్యది యాహార మయ్యె నాతిథ్యంబు దానన నడపుట ధర్మ సరణి యనవుడు సట్ల కా కని ఫలంబులు మూలములు నుపయోగించె మోదభరితుఁ డగుచు నప్పాండుసుతాగ్రణి యబ్బంగి నఖిలజనములు శాహారకలశ