ఆశ్వమేధపర్వము, తృతీయాశ్వాసము. నీ, పుండరీకాక్ష యీపుడమి యంతయును భవత్పాదపం క్తిసం వ్యాప్త మయ్యె నంబరం చెట్లను నావృత మయ్యె నీరుహిత సముజ్జ్వలమ స్తకముల నంతరిక్షము దావ కాద్భుతకుంట దేశంబుల చేత సంఛన్న మయ్యె భవదీయమహనీయ బాహర్గళా నిచయాపిహితము లయ్యె నన్ని దిశలు తే బహుచరణములు బహుశిరోభాగములను !· 3) బహుజఠరముల బహుభుజా ప్రకరములను 'దేవ యిట్లు సర్వంబును నీవ యై త సర్చి తిః నాదు కన్ను మనంబుఁ దనిపె. 257 50 న విశ్వరూపా యీరూపం బు సంహరించి నీ దగు నెప్పటియా కారంబు గైకొనవే యనిస నప్పర మేశ్వరుండు వగంబు గోరు మని యానతిచ్చిన నమ్మహితాత్తుండు సంశ్రీరా తార్తిహర నీమూర్తి గంటి నింతకంటే మిక్కిలి వరంబులును గలవే యనుటయు క. ఆ దేవుఁ డతనితో నటు, గాదు ననుం గనుట శుభము గావింపక పో దేదీ 51 య మడుగు మిత్తుఁ బ్ర, మోదంబుగ నీకు ననిన ముని యి ట్లనియెన్. వ. అవశ్యంబును నా కట్లు గావలయు నని యవధరించి లేని దేవా యిది మరుదేశం బిచ్చట జలంబు దుర్లభంబు నాకు జలసన్నిధి యెప్పుడుం గలుగఁ బ్రసా దింపుము. 58 క, అనుటయు నంబుజనాభుఁడు, దనయెప్పటిలలితమూర్తి ధరియించి మునీం ద్రునితోడ నన్నుఁ దలఁపఁగ, ననఘా దొరకొను జలంబు లని పలికి తగన్. వ. వీడ్కొసి చనియెం బదంపడి యీభృగువంశవరుం డొక్కెడ మెలంగు చుండి తృషితుం డయి హృషీ కేశుం దలంచిన. 55 నీ కుక్కలు సుట్టి రా నొక్క మాతంగుండు బాణ బాణాసనపాణియును ది గంబగుండును మలినాంగుండు నగు వాఁడు దోఁచె నచ్ఛజలంబు దొరఁగు చుండు మేనితో నమ్మని వానిఁ దప్పక చూడ వాఁ డో యుదంక యివ్వారి డప్పి డ్రావు మనుడు నాభూసురాగ్రణి యొల్లనని పల్కెఁ బల్కిన వినుము నీవు ఆ. నీరువట్టు శ్రీ మముఁ గూరిన నీమీఁది, కరుణ వచ్చినాఁడఁ గాదు నాక యర్థిఁ ద్రావు టొప్పు ననియె నాచండాలు, నలుక మెయి నదల్చె నతపస్వి. 56 వ. ఆదల్చిన నతుడు సారమేయంబులుం దాను సంతర్థానంబు సేసి నాసంయమి వెఱఁగుపడి యొక్కింత విచారించి యిక్కపట ప్రచారంబు గృష్ణసంపాదితంబు * గా వలయు నని యూహించుసమయంబున నయ్యెడకుం గృష్ణుం జరుగు దెంచుటయుం గనుంగొని యమ్మహాత్తునితోడ నమునివరుండు. క. జలము నినుఁ దలఁపగా నిటు, గలుగునె చండాలునొడలఁ గా జెడునీ రే నలఘుగుణ త్రావుదునె యే, కొలఁదిశ్రమం బైన వరము గుచ్చిత మయ్యెన్. 1 వత్పాదపంకజవ్యాప్తు. G_83 57
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/566
స్వరూపం