238 శ్రీ మదాంధ్ర మహాభారతము యధ్యాత్మ విద్యావిషయ వాక్యంబుల తాత్పర్యంబు చిత్తంబున నెలకొలిపి భావ నానిరతవయి యుండుము 'నన్న పోలేదు వెఱువకు మనినఁ బత్ని సాష్టాంగదండ ప్రణామం బాచరించి కేలు మొగిచి. సీ. నీవు చెప్పిన మహనీయవాక్యనికాయ మతిగహనం ఒకృతాతులకును సర్థ గ్రహణశక్తి యనఘ కల్గునే కృతాతులకైన గ్రమనఁ దెలియవచ్చి యుండ దియ్యెఱుకకు సుదయింపఁ బట్టిన యట్టియుపాయంబు నాదరమున నాకుఁ బ్రసాదింపవే కరుణాకర నావుడు నాతఁ డన్నాతితోడ 96 ఆ. నరణి బ్రాహ్మణుండు గురుఁ డుత్తరారణి, "దపము శ్రుతము నిర్మథన మొనర్ప జ్ఞానవహ్ని పుట్టు మానిని యని చెప్పు, వనిత యిట్టు లనియె వల్లభునకు. 97 క. జనవినుత చరితి బ్రాహ్మణుఁ డనఁగా క్షేత్రజ్ఞుఁ డగుట యల్పము దోఁచెక్ మనమున నతని నరణిగాఁ, గొను టవ్వస్తువు నెఱింగిలోని పిదపఁ గదా. 98 వ. అనిన నతం డి ట్లనియె. 99 ఆ. అతనిఁ దోఁపఁ జేయునట్టి సాధనము లే, దింద్రియముల కందఁ డేమి లక్ష ణములు లేవు నిర్గుణత్వనిరూఢుం డ, హంత లేమిఁ దోఁచుఁ గాంత కనుము. వ. అని నిర్దేశించుటయు క్షేత్రజ్ఞవిషయసంశయంబు వాసి యయ్యింతి శాంతి నొందె నిని గోవిందుండు సెప్పిన గాండీవి యా బ్రాహ్మణుండు బ్రాహ్మణియు నిట్టివా రగుదురెవా రెచ్చటి వారు వారల నా కెఱింగింపవే యని యడిగిన సదేవుం డతనియాననం బాలోకించి, 101 క. నామనమును బుద్ధియును గృపామహితా బ్రాహ్మణుండు బ్రాహ్మణియు హృషీ కామేయమైన క్షేత్ర, జ్ఞామలవస్తు వన నేన యనియె న రేంద్రా. --@ గురుశిష్య సంవాదంబు గృష్ణుం డర్జునున కెఱింగించుట. 102 వ. అనిన విని యర్జునుం డచ్యుతునితో భవత్ప్రసాదంబున మదీయమతి యతి విశదయును సూక్ష్మగ్రాహిణియు నయి యున్న యది పరమం బైన వేద్యం బగు బహంబు నెఱింగింపవే యనుటయు నాకృష్ణుండు గురుశిష్య సంవాదం బనునితిహాసంబు విను మది నీప్రశ్నంబునకు నుత్తరం బయి యుండెడు న తెఱంగున మేధావి యగునొక్క శిష్యుండు సంశితవ్రతుం డయినగురు నడిగిన నగ్గురుండు ప్రజాపతి భరద్వాజ భార్గవ గౌతమ కాశ్యప వసిష్టాత్రి విశ్వామిత్ర ప్రముఖు లగుమునిజనంబు లాంగిరసుం బురస్కరించికొని విరించికడకుం జని తచ్చరణంబులకుం బ్రణమిల్లి హితం బెయ్యది తతాప్తికి సుపథం బెట్టిది వివరింప వేయని విన్నవించిన నన్న శ్రీనాసనుండు గృపాధురీణంబైనచిత్తంబుతో న తపస్విసత్తముల కెఱింగించిన తెఱంగు నీకుం జెప్పెద నవహితుండ వయి 1 నిన్నుంబోలేదు. 2 గ్రమ్మఱ. 3 దపము చేశనిర్మథన. 4 డెలమిలక్షణములు లేమినిర్గుణత్వ.
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/547
స్వరూపం