ఆశ్వమేధపర్వము, ప్రథమాశ్వాసము. 213 అ మరుత్తునియజ్ఞంబున హవిర్భాగంబులు గొన నింద్రాదులు వచ్చుట, ఆ వ. అని పలికి దవ్వులన యవ్వజ్రంబు వారించి గంధర్వునకు వీడుకోలు సేయించి యయ్యో గీంద్రుండు దేవేంద్రుని దేవతలను బిలిచె నమ్మహాత్మునిమహనీయమం తశక్తి వాహూతు లైనయప్పురుహూత ప్రభృతిబృందారకులు ప్రియంబున నరుగు దేర సమునిపతి యజ్జనపతి వారల నెదుర్కొను తెఱంగు నడసి తానును గూడ నడచి వారికి సర్ఘ్యపాద్యాది పూజనంబులు విధివిహిత ప్ర కారంబునం జెల్లించె నమ్మరుత్తుండును మరుత్పతికిం బ్రణమిల్లి దేవా నీవు విజయం చేసి నా జన్నంబు సఫలంబు సేసితి కృతార్థుండ నైతిం గృపాథామ నామీఁదియలుక మాని నన్నుం జల్లనిచూడ్కిం జూడు మని ప్రార్థించి సంవర్తుం జూపి యిత్తాపన పతీ బృహస్పతిస్వరూపంబ కావునం గ్రతుయాజకుడు గాఁ బ్రతిగ్రహించితి నని విన్నవించుటయు ననిమిషనాథుండు నీవలనం బ్రీతిం బొందితి నీతం డయ్య మరగురుననుజుం డతనియ ట్లగుటకు సందియం బేమి యనుచు వికచవదనుం డై కనుంగొనిన సమ్మునివరుం డా విజవరువ కి ట్లనియె. 98 ఆ. అఖిలలోకభ ర్త వమరేంద్ర నీ విట్టు, లాదరమున వచ్చు టరయ నాత పంబుఫలము గాదె పావనమూర్తి యీ, రాజు క్రతువుఁ బుణ్య రాశి యయ్యె. చ. సకలవిధానదఝుఁడవు సర్వము నారసి చేయఁ బంపు నీ సకృపవిలోకనంబులను 'సార్ధము లై క్రతుమంత్రతంత్రముల్ వికలత లేక చెల్లు జనవి. శ్రుతుఁ డీనృపుఁడు భవద్ధయ సుకృతులలోనఁ బెంపు గని చూడఁ గనుం దగఁ బుణ్యలోకముల్. 100 వ. అని యిట్లు నిభృతుం డై యభివర్ణనపూర్వకంబుగా సంభాషణం బాచరించిన. సీ. భూరిహర్షంబునఁ బొంది పురందరుం డమృతాశనులఁ గలయంగఁ జూచి యజ్ఞ వాటం బుదాత్తాభిరామంబుగఁ జేయింపుఁ డప్సర స్త్రీ జనంబు నాట గంధర్వులపాటఁ జెల్లింపుఁడు నావుడు వా రట్ల నడపి మఱియు సకలకర్మములకు సాహాయ్య మాచరింపంగ వేజో కయగ్నిభంగి వెలిఁగి తే. లసితసముచిత పీఠ మలంకరించి, వేడ్క సంవర్తముని హవిర్విధి యొనర్ప యాగ ముజ్జ్వలమును సుప్రీయోగకంబు, నగుచునొప్పా రెభరతకులా గ్రగణ్య. తే. ప్రీతిఁ బేర్వేరఁ బిలిచి చేనేత సోమ, మమ్మహాయోగి యంది యీ నెమ్మిఁ బాన మాచరించి సహస్ర నేత్రాదు లైన, యమరు లానందమున దేలి రధిపముఖ్య. వ. ఇట్లు మరుత్తుండు మరుత్పతికిం బరమతృ ప్తి గావించి యామంత్రణంబు సేయ సయ్యందఱు సభినందించి నిజనివాసంబులకుం జని రజ్జననాథుండు. చ. యజనము నెల్లుకాలము సమాప్తతఁ బొందిన నాఁడు దద్దయ క్కజ మగుభంగిఁ బ్రస్ఫురిత కాంచన రాసు లనేకముల్ బహు 1 సాధ్యములై 2 ప్రీతి రెట్టింపఁ బేర్వేరఁ బిలిచి సోమ, 104
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/522
స్వరూపం