Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

మంబునం బెద్దకాలం బుగ్రతపంబు సేయుచు వనంబునఁ బరిభ్రమించు వాఁ
డొక్కసల్లకీపల్లవంబున నధోముఖు లయి వ్రేలుచున్న తనపితరులం జూచి “యి
వ్విధంబున మీ రున్న కారణం బేమి?” యని యడిగినఁ బితరు లి ట్లనిరి.

⁠ 324


తే.⁠

“అయ్య! యేము నీపితరుల; మధికనిష్ఠ
బ్రహ్మచారివై నీవు తపంబు సేయు
చున్నవాఁడవు సంతతి నొల్ల; కదియ
కారణంబుగ మా కూర్ధ్వగతియు లేదు.

⁠ 325


వ.⁠

ఇంక నైనను నీవు వివాహం బై సంతానంబు వడసిన మాకుఁ బుణ్యగతి వడయ
నగు” ననిన “నట్ల చేయుదు” నని యగస్త్యుండు దనతపశ్శక్తిం జేసి పుత్త్రకాముం
డైన విదర్భరాజున కొక్కకూఁతుం బుట్టించిన నది లోపాముద్రయను నామం
బుతో జలంబులయందు నలినియుంబోలె, వినీతునందు లక్ష్మియుంబోలె,
నుద్యుక్తునందు విద్యయుంబోలెఁ బెరిఁగి యౌవనంబు దాల్చి, రూపవతి యై
వయోరూపంబుల ననురూప లయినకన్యకాశతంబుతో నొప్పుచున్నంత.

⁠ 326


క.⁠

తరుణి నగస్త్యుభయంబున
వరియింపఁగ నోడి రాజవరులు మనోజా
తురు లగుచుండిరి; తగియెడు
వరు రోయుచు నుండె సుతకు వైదర్భుండున్.

⁠ 327


వ.⁠

అంత నగస్త్యుండు విదర్భరాజుపాలికి వచ్చి “నాకు లోపాముద్ర నిచ్చునది” య
నిన [1]విదర్భేశ్వరుండు తనతనూజ నమ్ముని కీనోపక మనంబున ననుతాపించి
యక్కన్యకం జూచి యాత్మగతంబున.

⁠ 328


ఉ.⁠

“నారలు గట్టి, కూర లశనంబుగ, నుగ్రవనంబులోఁ దపో
భారమునం గృశుం డయిన బ్రాహ్మణుఁ డీలలితాంగిఁ బెండ్లి యై
నారలు గట్టి, కూర లశనంబుగ, నుగ్రవనంబులోఁ దపో
భారము దాల్చి యుండుమని పంపక మిన్నక యుండ నిచ్చునే.

⁠ 329


ఆ.⁠

ఎఱిఁగి యెఱిఁగి [2]దీని నె ట్లీఁగ నగు? భోగ
యోగ్యయైనయది పయోజనేత్ర
యీనినాఁడు శాప మిచ్చుఁ గా కిమ్ముని
యేల సైఁచు? నింక నెట్టులొక్కొ?”

⁠ 330


వ.⁠

అని వైదర్భుండు దానునుం బత్నియు వగచుచున్న వారిపాలికి వచ్చి లోపా
ముద్ర యి ట్లనియె.

⁠ 331


క.⁠

“ఇమ్మునివరునకు నన్నుఁ బ్రి
యమ్మున నిచ్చునది మీకు నతిచింతాభా
రమ్మేల” యనిన నిరువురు
[3]నమ్ముదితకు సంతసిల్లి యధిక విభూతిన్.

⁠ 332

అగస్త్యుఁడు లోపాముద్రను వివాహం బగుట

వ.⁠

విధ్యుక్తంబుగా నక్కోమలి నగస్త్యునకు వివాహంబుఁ జేసిన నగస్త్యుండు
లోపాముద్రం బరిగ్రహించి దానిదివ్యాంబరాభరణంబు లపనయించి, వల్క
లాజినధారిణిం జేసి, ధర్మచారిణిం దోడ్కొని చని, గంగాద్వారంబునం దపంబు
సేయుచు నొక్కనాఁడు.

⁠ 333
  1. ↑ వైదర్భుం డాత్మగతంబున
  2. ↑ తపసి కెట్టు లీనగు భోగ, యోగ్య యైనయిప్పయోజనేత్రి, (యీసరోజనేత్ర, నీనినాఁడు)
  3. ↑ నమ్మాటకు ... నధికప్రీతిన్