Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

సంగమంబును నాడి యందు బ్రాహ్మణులకు గోహిరణ్యదానంబులు సేసి, ప్రయా
గం [1]గొన్నిదినంబు లుండి, వేదవిదులయిన బ్రాహ్మణులవలన వేదార్థంబు లెఱుం
గుచుఁ జని, యనేకపుణ్యనదీసముద్భవం బయిన గయపర్వతంబును, రామసరం
బును, బ్రహ్మసరంబును, వైవస్వతతీర్థంబునుం జూచి, గయయందు నక్షయవటం
బున నార్షేయం బైన విధానంబునం జాతుర్మాస్యక్రతువులు సేసి, ఋషులవల
నం బుణ్యకథలు వినుచున్న యవసరంబున శమఠుండను మహాముని ధర్మరాజున
కి ట్లనియె.

⁠


సీ.⁠

“అనఘుం డమూర్తరయః ప్రియపుత్త్రుండు
                 గయుఁడను రాజర్షి క్రతువు లిందు
బ్రహ్మసరంబునఁ బరగంగ మును చేసె;
                 నాతని యజ్ఞంబులందు సకల
జనభుక్తశేషాన్నశైలంబు లిరువది
                 యే నగుసంఖ్య దానెఱుఁగ నయ్యెఁ
దత్కృతక్రతుబహుదక్షిణాసంఖ్యయు
                 నుడుసికతాసంఖ్యయును నెఱుంగఁ

⁠


ఆ.⁠

గాదు జనుల; కట్టి గయునామమున గయ
యనఁగఁ బుణ్యతీర్థ మయ్యె నిదియుఁ;
బితృహితార్థమిందుఁ బిండప్రదానంబు
సేయఁ గనిన నిష్టసిద్ధి [2]గలుగు.”

⁠ 318


వ.⁠

అని చెప్పిన శమఠువలన గయామాహాత్మ్యంబు విని యగస్త్యాశ్రమంబున కరిగి
రంత ధర్మరాజు రోమశున కి ట్లనియె.

⁠ 319


మధ్యాక్కర.⁠

“వాతాపి యనువాని నెట్లుసంపె సద్వంద్యుఁ డగస్త్యుఁ
డాతతతేజోధికుండు నావిందు నమ్మునినాథుఁ;
బ్రీతిని దచ్చరితంబు వినఁగ నభీష్ట మిం” దనిన
నాతని కి ట్లని చెప్పె రోమశుం డన్ముని పేర్మి.

⁠ 320


క.⁠

“వీతభయుఁ డిల్వలుండును
వాతాపియు ననఁగఁ బరగు వరదైత్యులు వి
ఖ్యాతబలులు వసియింతు ర
రాతిహరుల్ మణిమతీపురంబున [3]నొప్పన్.

⁠ 321


వ.⁠

అం దగ్రజుం డయిన యిల్వలుం డొక్కబ్రాహ్మణు నతిభక్తి నర్చించి “నాకు సకల
కామసిద్ధికరం బగు మంత్రం బుపదేశింపు” మని ప్రార్థించి విఫలప్రార్థనుం డై
యరిగి తనతమ్ముఁ గామరూపధరు వాతాపి నపుడు మేషరూపంబు సేసి వధి
యించి వానిమాంసం బిమ్ముగా వండించి దాని నావిప్రునకుఁ గుడువం బెట్టించి.

⁠ 322


తే.⁠

విప్రుకడుపులోనున్న యవ్వీరు ననుజుఁ
బిలిచె వాతాపి రమ్మని ప్రియముతోడ
జీవితుండయి వాఁడు సెచ్చెరను విప్రు
కడుపు వ్రచ్చుచు వెలువడి క్రాఁచె విప్రు.

⁠ 323


వ.⁠

అది మొదలుగా నిల్వలుండు దనకడకు నతిథు లై వచ్చు విప్రుల నిప్పాట నంత
కుపురంబున కతిథులం జేయుచున్నంత నట యగస్త్యుండు బ్రహ్మచర్యాశ్ర

⁠
  1. ↑ "గొన్నిదినంబు లుండి" అనుటకును "వేదవిదు లయిన" అనుటకును నడుమ, "క. ఎలమిసి ధర్మతనూజుఁడు, గులపావనుఁ డగుచు విప్రకోటుల కెల్లన్, వెలయఁగ నభీష్టవస్తువు, లలయక దానములు చేసె నభివాంఛితుఁడై. వ. మఱియు వేదవిదులయిన." అని యొకప్రతి.
  2. ↑ వెరుఁగు
  3. ↑ ఁబేర్మిన్