| వ. |
“శారీరనియమంబులు మానుషవ్రతంబు లనంబడు; మనోబుద్ధిశౌచంబులు దేవ
వ్రతంబు లనంబడు; నట్టి సౌమ్యవ్రతవిశేషంబులు సలుపుచు ఋజుమార్గులరై
తీర్థంబులు సేవించునది; తీర్థాభిగమనంబున మహాభిషనాభాగభరతభగీరథము
చుకుందమాంధాతృసగరసార్వభౌమాష్టకరోమపాదులయట్ల శత్రుజయంబును
సర్వలోకసుఖంబులు బడయుదు” రని చెప్పి మునివరులు మువ్వు రరిగి; రంత
నజాతశత్రుండు రోమశున కి ట్లనియె.
| 309
|
| క. |
“ధరణి నధార్మికులగు కా
పురుషుల కభివర్ధనంబుఁ బుణ్యచరిత్రం
బరగెడు ధార్మికులకు దు
ర్ధర మగు నవివర్ధనంబుఁ దగునె? మునీంద్రా!
| 310
|
| వ. |
మఱియు నచేతనంబులయ్యును గిరిసరిత్సరోవరంబులు పుణ్యతీర్థంబులై జగత్పా
వనంబులై జనులకు దురితాపహరణంబు లయిన కారణం బేమి” యని యడిగిన
నతనికి రోమశుం డి ట్లనియె.
| 311
|
రోమశుండు ధర్మరాజునకు ధర్మవిశేషంబులు సెప్పుట
| చ. |
“వసుధ నధర్మవర్తు లగువారల[1]వర్ధన మెన్నఁడున్ సమం
జస మయి నిల్వనేరదు, భృశంబుగ నాశము వొందు; దుర్మద
వ్యసను లధర్మవర్తనఁ బ్రవర్ధితులయ్యును, నేము చూడ రా
క్షసులును, దైత్యదానవులుఁ గ్రాఁగరె తొల్లి సహస్రసంఖ్యలన్.
| 312
|
| క. |
దేవతలు ధర్మవర్తులు
గావున నభివృద్ధిఁ బొంది ఘనమగు నిత్య
శ్రీవిభవాన్వితు లయి ధర
ణీవల్లభ! యున్నవారు నిరుపమశక్తిన్.
| 313
|
| క. |
ధర్మసుత! ధార్తరాష్ట్రు ల
ధార్మికులై [2]పెఱిఁగిరేనిఁ దడయక విధిచే
నిర్మూలితులగుదురు; దు
ష్కర్మంబున నసురులట్ల కడు నస్థిరులై.
| 314
|
| వ. |
అది యె ట్లనిన నధర్మవర్తులయందు దర్పంబు వుట్టు; దర్పంబువలన మానంబు
వుట్టు; మానంబువలనఁ గ్రోధంబు వుట్టుఁ; గ్రోధంబువలనం జేసి లజ్జయు, వృత్తం
బునం జెడు; [3]నష్టలజ్జావృత్తు లయినవారి నుపశమనంబును, లక్ష్మియు విడుచు.
| 315
|
| క. |
మీ రమరసదృశులరు, ధ
ర్మారంభవిశిష్టమతుల రగుటను [4]సుచిర
క్ష్మారమ్యు లగుదు; రాజి జి
తారాతుల రగుదు రుద్ధతాహవములలోన్.
| 316
|
| వ. |
ధర్మవర్తులైన దేవతలు, ఋషులు నాశ్రయించుటం జేసి తీర్థంబులు పవిత్రంబు
లై సర్వకామప్రదంబులై వర్తిల్లుచుండుఁ, దీర్థసేవను, గ్రతువులను, దానంబులను,
బ్రాహ్మణుల దీవనలను జనులు సర్వదుఃఖవిముక్తులయి శ్రేయఃప్రాప్తు లగుదు”
రని చెప్పిన నమ్మునివరువలన [5]నొండుధర్మస్థితులు వించుఁ బాండవు లరిగి నైమి
శంబు, నశ్వతీర్ధంబును, గంగాఘోషంబును, గన్యాతీర్థంబును, గోమతియును, బా
హుదయును, మహానదియు, దేవయజనం బయిన ప్రయాగయు, గంగాయమునా
|
|
- ↑ వర్తన
- ↑ పరగిరేనిఁ ... నీచే, నిర్మూలి
- ↑ లజ్జానివృత్తు లయిన
- ↑ సుచిర, శ్రీరమ్యుల రగుదురు విజి, తారాతుల రగుదు
- ↑ నొండుకథలు వినుచుఁ