Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

జంబున సరస్వతీస్నాతు లై యగ్నిష్టోమఫలంబు వడయుదురు; ఋషు లెందే
నుండి యాత్రాపరులై కురుక్షేత్రంబునకుం బోదు, రట్టి నైమిశకుంజం బాడి
ఋషితృప్తి సేయుదురు; బ్రహ్మతీర్థం బాడి వర్ణాంతరులు బ్రాహ్మణు లగుదురు;
బ్రాహ్మణులు బ్రహ్మలోకప్రాప్తు లగుదురు.

⁠ 264


సీ.⁠

అనఘుఁడు [1]మంకణుం డను నొక్కబ్రహ్మర్షి
                 తనచేయి వ్రయ్యంగ దర్భఁ గొనిన
సాంద్రమై శాకరసం బందు నిర్గతం
                 బగుడును హర్షించి యాడుచున్నఁ
జూచి, సహింపక సురలును మునులును
                 హరుపాలి కరిగి “దేవాదిదేవ!
మునివృత్త మేవిధంబున నివృత్తం
                 బగునట్లుగాఁ జేయవే” యనిన హరుఁడు

⁠


ఆ.⁠

దపసిరూప మపుడు ధరియించి, యమ్ముని
కడకు వచ్చి “యేమి కారణమున
నాడె? దేమి విస్మయం బిందుఁ జూచితి?
చెప్ప నుచిత మేనిఁ జెప్పు” మనిన.

⁠ 265


వ.⁠

“నా కరంబున శాకరసంబు వెలువడిన విస్మితుండనయి హర్షించి యాడెద” ననిన
“నిది యేమి విస్మయంబు? దీని జూడు” మని హరుండు తన యంగుష్ఠంబున నంగుళీ
తాడనంబు చేసిన, నందు హిమసన్నిభం బయిన భస్మంబు వెలువడినం జూచి, లజ్జి
తుండయి, “నీవు పరమేశ్వరుండ” వని నమస్కరించి, వేదమంత్రంబుల స్తుతియించి,
“దేవా! నీప్రసాదంబున నాకుఁ దపోవర్థనంబు గావలయు” ననిన నమ్మునివరునకు
నీశ్వరుండు గరుణించి “నీకుఁ దపోవర్ధనమగు; నేను నీయాశ్రమంబున నుండుదు”
ననియె; నట్టి సప్తసారస్వతతీర్థంబు లాడినవారికి సారస్వతసిద్ధి యగు; బ్రహ్మాది
దేవతలచే నధిష్టితంబు లయిన యౌశనసతీర్థంబును, గపాలమోచనంబు, విశ్వా
మిత్రంబుఁ, గార్తికేయంబు ననియెడుతీర్థంబుల నాడి పాపవిముక్తు లయి బ్రహ్మ
లోకంబు వడయుదురు.

⁠ 266


క.⁠

వేదములయందు వినఁగఁ బృ
థూదకతీర్థంబ యుత్తమోత్తమము సురేం
ద్రాదిసురవరులకును వ్యా
సాది మహాయోగివరుల కాస్పద మగుటన్.

⁠ 267


వ.⁠

అందు శరీరత్యాగంబు [2]సేసినవార లపారపాపవిముక్తులై ముక్తు లగుదురు; సుర
కన్యాసరస్వతీసంగమస్నాతు లయినవారు బ్రహ్మహత్యాదిపాతకంబువలనఁ
బాయుదురు; దర్భినిర్మితం బయిన యర్థకీలతీర్థం బాడిన శూద్రులు బ్రాహ్మణు లగు
దురు; బ్రాహ్మణులు పరమసిద్ధు లగుదురు; శతంబును, సహస్రంబు ననుతీర్థం
బులందుఁ జేసిన జపదానోపవాసంబులు శతసహస్రగుణంబు లగు; వేల్పులెల్లం
గుమారు సేనాపతింగా నెందే నభిషేకించి, రట్టితైజసం బనుతీర్థంబును, దాని
తూర్పున నుండు కురుతీర్థంబును, స్వర్గద్వారం బనుతీర్థంబును, జూచినవారికి స్వర్గ
ద్వారంబు వివృతంబగు; రుద్రపత్ని యనుతీర్థంబున శంకరనారాయణుల నర్చించి

⁠
  1. ↑ శౌనకుం డను నొక ... జేయుమీ వనిన హరుఁడు, దపసిరూప మొప్ప ధరియించి
  2. ↑ సేసినవారు పాపవిముక్తు లగుదురు ... అత్రినిర్మితం బైన అతికర్షణం బనుతీర్థం బాడినశూద్రులు