| ఆ. |
గడుఁబ్రసిద్ధ మిదియుఁ గర్కోటకుని, దమ
యంతిఁ, బుణ్యమూర్తి యైన నలుని,
[1]నుతచరిత్రుఁ డైన ఋతుపర్ణుఁ గీర్తింప
గలిభయంబు లెల్లఁ గ్రాఁగు నధిప!”
| 231
|
ధర్మరాజునొద్దకు నారదమహాముని వచ్చుట
| వ. |
అని చెప్పి బృహదశ్వుం డరిగినం బాండవులు గాండీవిరాకయ కోరుచుఁ దదా
లోకనప్రీతి నుండునంత నంతరిక్షం బెల్లఁ దనతేజంబున వెలుంగుచుండ నార
దుండు వచ్చి యనుజసహితుం డైనధర్మరాజుచేతం బూజితుం డై యి ట్లనియె.
| 232
|
| ఆ. |
“[2]ధర్మపుత్త్ర! నీయుదారచరిత్రకు
ధర్మమతికిఁ దృప్తతముఁడ నైతి;
నడుగు మిష్ట మెద్ది” యనినఁ గృతాంజలి
యై మహీశుఁ డిట్టు లనియె భక్తి.
| 233
|
| వ. |
“మునీంద్రా! నీవు తృప్తుండ వైనం ద్రిజగంబులకుం దృప్తి యగు; నిన్ను జూ
చి కృతార్థుండ నైతి; నా కెప్పుడు నొక్కధర్మసందేహంబు గలదు; దాని నిర్ణ
యించి యానతీయవలయు.
| 234
|
| చ. |
ధరణిఁ బ్రదక్షిణంబుగ ముదంబునఁ గ్రుమ్మరి, తీర్థసేవనా
పరు లగుచున్న ధన్యులు శుభస్థితి నెట్టిఫలంబు నొందఁ గాం
తురు? బహుతీర్థకీర్తనముతే నెఱిఁగింపుము దీని” నావుడున్
నరవరుఁ డైనపార్థునకు నారదుఁ డిట్లని చెప్పెఁ బ్రీతితోన్.
| 235
|
| క. |
“[3]ధీరుఁడు భీష్ముఁడు గంగా
ద్వారమునం దొల్లి పితృహితంబుగ [4]శుభక
ర్మారంభుఁ డగుచు నుండె ను
దారుం డధ్యయనసంతతవ్రతపరుఁ డై.
| 236
|
| వ. |
అతని పితృదేవతాభక్తికిఁ, బరమధర్మచరితంబునకు మెచ్చి తద్దర్శనాపేక్షం బుల
స్త్యుం డను మహాముని వచ్చిన నతిభక్తుం డయి యాభీష్ముం డమ్మునిఁ గుశపీఠం
బున నునిచి, యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, యతని యడుగులు తల నిడు
కొని, దక్షిణజానుస్పృష్టమహీతలుం డయి “యేను భీష్ముండ; భవద్దాసుండ”
నని ముకుళితహస్తుం డయి యున్న వానికిఁ బులస్త్యుం డి ట్లనియె.
| 237
|
| క. |
“పితృదేవభక్తిఁ బుణ్య
వ్రతచర్యను నీవ యెల్లవారికి నత్యు
న్నతుఁడవు; గావున నీచె
ధృతిఁ గానఁగఁబడితి నేఁ బ్రతీపకులేశా!
| 238
|
| వ. |
నీయిష్టంబు సెప్పు; మే నమోఘదర్శనుండ” ననిన భీష్ముండు ముదితహృదయుం
డై “మునీంద్రా! నాయందు నీకుఁ బ్రసాదబుద్ధి గలదేనిఁ జెప్పు”మని.
| 239
|
| క. |
మనుజేంద్ర! నన్ను నీ యడి
గినయట్ల పులస్త్యుఁ బుణ్యకీర్తను గంగా
తనయుం డడిగిన, నతనికి
ననఘచరిత్రునకు నిట్టు లని ముని సెప్పెన్.
| 240
|
- ↑ ఋషిచరిత్రుఁ; ఋజుచరిత్రుఁ
- ↑ ధర్మనీయుదార కర్మచరిత్రకు
- ↑ ఈకందమునకు బూర్వము, క. "వినవయ్య నీవు నన్ వేఁ, డిన ప్రశ్నకు నుత్తరంబు డెందం బలరన్, విని(ను)పింతు నీకు నభిమత, మనఘా! యే జేయువాఁడ నవనీనాథా (నవహితబుద్ధిన్)." అని కొన్నివ్రాఁతప్రతులఁ గానిపించెడి.
- ↑ శుభధర్మా