Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

“ధరణిఁ గల రాజు లిట యె
వ్వరు వచ్చినవారు లేరు; వైదర్భి యొరున్
వరియింప నంత ధర్మే
తరచరితయె?” యనుచు నుండెఁ దద్దయు లజ్జన్.

⁠ 185


వ.⁠

బాహుకుండును [1]రథశాల రథాశ్వంబుల బంధించి, రథసమీపంబున విశ్రమిం
చియుండె; నంత దమయంతి బాహుకవార్ష్ణేయులతోడ వచ్చిన ఋతుపర్ణుం
జూచి విఫలమనోరథయై యుండనోపక కేశిని యనుదానిం బిలిచి “ఋతుపర్ణు
నయోధ్యాపతింగా వార్ష్ణేయు సూతపుత్రుంగా నెఱింగితి; బాహుకుం డను
వాఁ డెవ్వండో? వానియందు నాహృదయంబు ముదితం బగుచున్నయది; మన
పర్ణాదునకుఁ బ్రతివచనం బిచ్చినవాఁడు వాఁడ కావలయు; వాని కడకుం బోయి
యెఱింగి ర” మ్మని పంచిన నదియును బోయి బాహుకుం గని, “దమయంతి నీకుశలం
బడుగఁ బుత్తెంచె; నిందుల కేమికారణంబున వచ్చి?” తనిన దానికి బాహుకుం
డి ట్లనియె.

⁠ 186


క.⁠

“ప్రియమున దమయంతిపున
స్స్వయంవరము సేయఁ గడగి [2]సకలక్షత్త్రా
న్వయవీరుల రావించిన
నయనిధి ఋతుపర్ణుఁ డొక్కనాఁటన వేడ్కన్.

⁠ 187


క.⁠

వినవె శతయోజనంబులు
సనుదెంచె నయోధ్యనుండి సరి నిందుల; కా
తని రథసారథి నై యే
నును వచ్చితి నతనితో మనోవేగమునన్.”

⁠ 188


వ.⁠

అనిన “మూఁడవవాఁ డెవ్వఁ?” డని యడిగిన నక్కేశినికి బాహుకుం డి ట్లనియె.

⁠ 189


క.⁠

“నలు రథచోదకుఁ డతఁ డ
త్యలఘుఁడు వార్ష్ణేయనాముఁ” డనవుడు “వాఁ డ
న్నలభూపాలకు పోయిన
[3]వల నొం డెఱుఁగునొకొ?” యనిన వాఁ డి ట్లనియెన్.

⁠ 190


వ.⁠

“వార్ష్ణేయుండును నలుపుత్త్రుల విదర్భేశ్వరునొద్దఁ బెట్టిపోయి, నడుమ [4]నలురా
జ్యభ్రంశంబు విని ఋతుపర్ణుం గొలిచియుండె; నాతండును నలు నెఱుంగఁడు.

⁠ 191


క.⁠

నలుతో [5]నొక్కట నరిగిన
నలినాయతనేత్ర భీమనందన యొండెన్,
నలుఁడొండె నెఱుఁగుఁగా క
న్నలు నొరులకు నెఱుఁగఁ గారణము గలదె మహిన్.”

⁠ 192


వ.⁠

అనిన విని కేశిని యి ట్లనియె.

⁠ 193


సీ.⁠

“అడవిలో వస్త్రార్ధహారి యై [6]దయ లేక
                 ప్రాణేశ్వరుఁడు దనుఁ బాసి చనిన
నాటివస్త్రార్ధంబు నలినాక్షి యిప్పుడు
                 బరిధానముగఁ బాంసుపటలమలిన
మగుచున్న తనువుతో, ననయంబు జడగొన్న
                 యలకావలులతోడ, నవనితలము
శయనంబుగా, ధర్మచారిణి దమయంతి
                 యనఘ! వ్రతం బిట్టు లాచరించు

⁠


ఆ.⁠

చున్న” దనిన నవిరళోద్గతబాష్పపూ
ర్ణంబులైన లోచనంబు లెఱుక
వడకయుండ వదనపద్మంబు వాంచి, తా
నొండువలను సూచుచుండె నలుఁడు.

⁠ 194
  1. ↑ రథశాలరథంబుతో నశ్వంబుల బంధించి ... కావలయు కావున వానికడకుం
  2. ↑ సకలక్షత్త్రా, న్వయులను రావించుట విని
  3. ↑ వల నెఱుఁగండొక్కొ యనిన వాఁ డిట్లనియెన్
  4. ↑ నలురాజ్యభ్రష్టత్వంబు
  5. ↑ నొక్కట యరిగిన
  6. ↑ దయఁ దప్పి ... నొండుగడయుఁ జూచు