| |
మది [1]నెఱుఁగు నరుఁడు సంఖ్యా
విదుఁ డగు, దుష్కృతకళంకవిషముక్తుఁ డగున్.
| 176
|
| చ. |
సకలగుణప్రసిద్ధుఁ డగు [2]సర్వహితుం డగుఁ జూవె” యంచు బా
హుకునకుఁ బ్రీతితోడ విధియుక్తముగా నుపదేశ మిచ్చె న
త్యకుటిలబుద్ధి నక్షహృదయంబుఁ, గరంబు రయంబుతో విద
ర్భకుఁ జనువేడ్కఁ జేసి ఋతుపర్ణుఁడు పూర్ణమనఃప్రసన్నుఁ డై.
| 177
|
| వ. |
ఇట్లు నలుండు ఋతుపర్ణువలన నక్షహృదయంబు వడసి, సంతుష్టుం డై “నీకు నశ్వ
హృదయం బిచ్చెదఁ బరిగ్రహింపు” మనిన ఋతుపర్ణుం “డట్ల చేయుదు నది యం
తకు నీయంద యుండనిమ్ము; నావలసినప్పుడు గొందు” ననియె నంత నయ్యక్ష
హృదయసామర్ధ్యంబున నప్పుడు.
| 178
|
నలుండు గలిచేత విముక్తుండయి విదర్భకుఁ బోవుట
| క. |
నలుఁ దొల్లి [3]యాక్రమించిన
కలి గర్కోటకవిషంబు గ్రక్కుచు నొడలన్
వెలువడి, నలునకు విహితాం
జలియై, తన్నెఱుఁగఁ జెప్పెఁ జంచలుఁ డగుచున్.
| 179
|
| ఆ. |
వానిఁ జూచి నలుఁడు దానల్గి శాపమీ
నున్నఁ, గలి యెఱింగి “నిన్నుఁ బొంది
యహివిషంబుచేత ననిశంబు [4]దగ్ధుండ
నైతి; నింక నాకు నలుగ వలదు.
| 180
|
| వ. |
నిన్నుం గీర్తించినజనంబులు నావలని భయంబుఁ బొరయరు; నాకుం గరుణింపు” మనిన
నలుండు గోపం బుడిగెఁ; గలియు నవ్విభీతకవృక్షంబు నాశ్రయించె నది
మొదలుగా విభీతకం బప్రశస్తం బయ్యె; నట్లు నలుండు వికృతరూపమాత్రంబు
దక్కఁ దక్కినదుష్కృతంబులవలన విముక్తుం డై రథం బెక్కి యతివేగంబున
ఋతుపర్ణవార్ష్ణేయసహితుం డై విదర్భకుం జనియె; నంత సాయాహ్నంబున.
| 181
|
| క. |
మానుగ ఋతుపర్ణుఁడు భీ
మానుఙ్ఞాతుఁ డయి చొచ్చె నాప్రోలు రథ
ధ్వానంబు [5]మ్రోయుచుండఁగ
నానాదిఙ్ముఖములను ఘనధ్వనివోలెన్.
| 182
|
| సీ. |
దమయంతి యారథధ్వని విని ఠయిది నలు
రథఘోషమని యనురాగ మొంది,
నలు, నిషధేశుఁ, బుణ్యశ్లోకు, లోకోప
కారకుఁ [6]జూడంగఁ గాంతు నేఁడు;
ఘనభుజుఁ జూడంగఁ గాననినాఁడుఁ, దద్భు
జపరిరంభణోద్భూతసుఖముఁ
బడయనినాఁడును బ్రాణముల్ విడుతు నే
నని తలంచుచుఁ గమలాయతాక్షి
|
|
| ఆ. |
యారథాధిరూఢుఁ డై వచ్చు ఋతుపర్ణుఁ
జూచి యప్పు డధికశోకతప్త
యగుచు నుండె; నంత నాఋతుపర్ణుండు
భీముఁ గానవచ్చెఁ బ్రియముతోడ.
| 183
|
| వ. |
భీముండును వానిం బూజించి యొక్క[7]రమ్యహర్మ్యంబున విడియించిన ఋతు
పర్ణుం డప్పురంబున స్వయంవరం బను శబ్దంబు మొదలుగా వినం గానక యాత్మ
గతంబున.
| 184
|
- ↑ నెఱిఁగి నతఁడు
- ↑ సర్వవిదుం డగు ... ఋతుపర్ణుఁ డపూర్వమనఃప్రసన్నుఁ డై
- ↑ యాశ్రయించిన
- ↑ దగ్ధుండ, నైతి నాకు నింక సైఁపవలయు; నాకు నై సహింపు; కనుగ్రహంబు సేయు
- ↑ సెలఁగుచుండఁగ
- ↑ జూడంగఁ గంటి ననుచు
- ↑ రమ్యహర్మ్యతలంబు ... శబ్దంబు వినంగానక