Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

“అవనీశ! యీహయంబులు
పవనగతిం బఱచుఁ బ్రొద్దు వడకుండఁగ [1]నేఁ
డ విదర్భకు” ననవుడు విని
కువలయపతి మెచ్చి బాహుకున కి ట్లనియె.

⁠ 168


వ.⁠

“అట్లయిన నీ హయతత్త్వకౌశలం బెఱింగి నీకు నభిమతం బొనరింతు” నని రథం
బెక్కి బాహుక వార్ష్ణేయసహితుం డయి యరుగువాఁడు.

⁠ 169


మధ్యాక్కర.⁠

ఎదురను దవ్వులఁ జూచిన పొడవులెల్లఁ దత్క్షణమ
కదియఁగా, నవ్వి యెంతయును దవ్వయి కనఁబడఁ బిఱుఁద,
“నిది దినేశ్వరు రథమో! యనూరుఁడో యితఁ!” డంచు నపుడు
హృదయమునను గడు విస్మయం బందె నిక్ష్వాకుకులుఁడు.

⁠ 170


వ.⁠

వార్ష్ణేయుండును బాహుకురథంబు గడుపు నేర్పున కచ్చెరువడి యాత్మగతంబున.

⁠ 171


క.⁠

“ఈతండు శాలిహోత్రుఁడొ!
మాతలియో! నలుఁడొ! యొరులు మానవులు జవో
పేతముగ [2]నిట్లు హయముల
నీతి యెఱుంగుదురె ధారుణీవలయమునన్.

⁠ 172


వ.⁠

వయోవిద్యావైభవంబుల నతండు నలుం బోలియు, వికృతరూపధరుం డయిన
కారణం బేమియొ? మహాపురుషులు [3]దైవనియుక్తులై ప్రచ్ఛన్నవృత్తి నుండుదు
రు; వారి నెఱుంగం బోలునె యనుచుఁ” జనునప్పుడు ఋతుపర్ణుండు దనయుత్తరీయం
బు జారి భూతలంబుపయిం బడిన మలంగి చూచి “బాహుకా! వార్ష్ణేయుండు వోయి
యుత్తరీయంబు దెచ్చునంతకు రథగమనం బించుక మందంబు సేయు” మనిన
బాహుకుండును “నయ్యా! నీయుత్తరీయంబు వడినయెడ యిచ్చోటికి నొక్కయోజనం
బుగలదు దాని వార్ష్ణేయుం డెట్లు దే నేర్చు” నని రథగమనవేగమహాత్మ్యంబు
సెప్పుచు ననేకదేశంబులు గడచి చని యొక్కయెడ నగణ్యపర్ణఫలాశాఖాలంకృ
తంబయిన విభీతకవృక్షంబు గని రంత ఋతుపర్ణుండు బాహుకున కి ట్లనియె.

⁠ 173


ఆ.⁠

“ఎల్లవారు నెఱుఁగ రెల్లవానిని; భిన్న
విషయు లెల్లవారు విద్యలందుఁ
[4]దొలఁగ కే నెఱుంగుదును దృష్టిమాత్రన
సకల మైన వస్తుచయము సంఖ్య.

⁠ 174


వ.⁠

ఇవ్విభీతకంబున ఫలపర్ణసముదాయసంఖ్యఁ జెప్పెద విను; మీ రెండుశాఖలం
గల పర్ణఫలంబులు పదివేలు నొక్కండు; దక్కినశాఖలం గలయవి రెండువేలుం
దొంబదే” ననిన బాహుకుండు విని “వీని నెన్నికాని నిశ్చయింప నేర” నని
తనరథంబు నిలిపి యావృక్షం బాక్షణంబ యురులం ద్రోచి యయ్యైశాఖలం
గల యాకులుం బండులు నెన్నిన, ఋతుపర్ణుండు సెప్పినయన్నియయిన, నచ్చెరు
వడి “యివ్విద్య నాకు నుపదేశింపవలయు” నని యడిగిన ఋతుపర్ణుం డి ట్లనియె.

⁠ 175


క.⁠

“ఇది యక్షహృదయ మనఁగా
విదితం బగు విద్య” దీని విద్యుక్తముగా

⁠
  1. ↑ నేఁడ విదర్భ కరుగు ననవుడు
  2. ↑ నిట్లు రథహయ, నీతి
  3. ↑ దేవయుక్తు లై ... మెలంగి (మగుడి) బాహుకా నాయుత్తరీయంబు భూమిపయిం బడియె ... వార్ష్ణేయుండు
  4. ↑ తొడరి యే నెఱుంగు