| |
దవదహనం [1]బుదగ్రతరుదాహము సేయుచు నున్నఁ జూచి మా
నవపతి దాని యంతరమునన్ వినియెన్ “నరనాథ! నన్ను గా
రవమునఁ గావ వేగ యిట ర” మ్మను నార్తమహానినాదమున్.
| 124
|
| క. |
విని శంకింపక చెచ్చెర
ననఘుం డత్యుగ్రతరదవానలమధ్యం
బున కరిగి కనియె దీనా
నను [2]మండలితాంగు నొక్కనాగకుమారున్.
| 125
|
| వ. |
అన్నాగకుమారుండును నలునకుం గృతాంజలియై “యేను గర్కోటకుం డను
వాఁడఁ; [3]గర్మవశంబున నొక్కబ్రహ్మఋషి నుపాలంభించి తచ్ఛాపంబున నెక్క
డం గదల నేర కున్నవాఁడ
| 126
|
| క. |
[4]నాలుగుదిశలను దావ
జ్వాలావలి గవిసె; మ్రంది చా నోప; మహీ
పాలక! న న్నొకసరసీ
కూలముఁ జేరంగ నెత్తికొని పొమ్ము దయన్.
| 127
|
నలుఁడు గర్కోటకునిచేత దష్టుం డగుట
| వ. |
నన్ను రక్షించిన నీకుం బ్రియంబు సేయ నోపుదు” [5]ననిన వాని నెత్తికొని పోవం
జులుకనై యంగుష్ఠప్రమాణదేహుం డై యున్న నెత్తికొని నలుం డతిత్వరితగతి
నరిగి, తాపవర్జితంబైన యొక్క సరోవరసమీపంబున విడువం బోయిన, “నింకను
బదియడుగు లరుగుము నీకు శ్రేయఃప్రాప్తిఁ జేసెద” ననిన నడుగు లెన్నికొనుచు
నరిగి పది యగు నడుగునప్పు డప్పాముచేత దష్టుం డై తన రూపంబు విడిచి వికృ
తరూపంబుతో నున్న; నన్నలులకుం గర్కోటకుం డాత్మరూపంబు సూపి యి
ట్లనియె “నయ్యా! నీవు నాచేత విషపీడితుండ వైతినని దుఃఖింపవలదు; ని న్నొరు
లెఱింగిన నెగ్గగుం గావున వికృతశరీరుం జేసితి; నెంతకాలంబు నీశరీరంబున
నావిషం బుండు నంతకాలంబునకు నీకు విషోరగరాక్షసపిశాచశత్రునివహంబు
వలని భయంబు లేదు; సర్వసంగ్రామజయంబును, భార్యాసంగమంబును, నెప్పటి
రాజ్యవిభవంబును నగు; నీ కెప్పుడేని నిజరూపంబు సేకొన నిష్టంబయ్యె నప్పుడ
నన్నుం దలంపు; మీ వస్త్రంబు నీయొద్దకు వచ్చు; దీని ధరియించుడు నిజరూప
ప్రాప్తి యగు” నని వరం బిచ్చి వెండియు ని ట్లనియె.
| 128
|
| మధ్యాక్కర. |
“ఇలఁ బ్రసిద్ధుఁడు ఋతుపర్ణుఁ డనెడు మహీశుఁ డిక్ష్వాకు
కులజుండు నీకు సేవ్యుం డగు; నతనిఁ గొలిచి యం దుండు
|
|
- ↑ బుదగ్రతరదాహము; బుదగ్రతనుదాహము ... నలనాథ
- ↑ కుండలితాంగు నొక్క
- ↑ గర్మవశంబున నొక్కబ్రహ్మవిదుం డైన బ్రహ్మర్షి నపాలంభించి ... నొక్కడలం గదలనేరకున్నవాఁడ నియ్యెరు(ర)గలి చిచ్చు సర్వజీవులకు సంహారకారణంబై పేర్చి నలుదెసలం గలయం బర్వి చనుదెంచు చున్నయది యీ యపాయంబు దలఁగునట్లుగా నుద్ధరింపవలయుఁ గరుణాత్మకుండవు కావున నిన్ను వేడెద.
- ↑ నాలుగుదిక్కుల దావ, జ్వాలావలి గవిసె నుండి చానోప; జ్వాలావలి గవయఁదొడఁగెఁ జననోప
- ↑ ననిన నట్లయినఁ గానిమ్మనుటయు వానికి నెత్తుకొనం జులకవునట్లుగా నంగుష్ఠమాత్రప్రమాణశరీరుం డైన నెత్తికొని ... నరిగి దవానలవర్జితం బైన యొక్కసరోవరతీరసమీ