| |
సార్థంబు గానంబడియెడు; నెట్టిపుణ్యంబో! యని పల్కి మఱియు ని ట్లనియె.
| 104
|
| క. |
“ఏను నలు భార్యఁ; బుణ్యవి
హీనతఁ [1]బతిఁ బాసి నవసి యేకాంతమ యీ
కానలఁ బరిభ్రమించెదఁ;
గానరె మీ రమృతసదృశుఁ గరుణాత్ము నలున్?”
| 105
|
| వ. |
అనిన దానికి సార్థవాహుండు శుచి యనువాఁ డి ట్లనియె.
| 106
|
| క. |
“నలుఁ గాన; మివ్వనంబునఁ
గల వెప్పుడుఁ గాంతు ముగ్రకరులను, సింహం
బుల, ఋక్షంబుల; నిది మ
ర్త్యుల కవిషయ; [2]మాతపంబు దూఱదు దీనన్.”
| 107
|
| వ. |
అనిన “నిచ్చనుప యెట వోయెడు?” నని యడిగినఁ “జేదిపతి యైన సుబాహుపురంబు
నకుం బోయెడు” నని చెప్పిన “నట్లేని మీతోడ వచ్చెద” నని యప్పరమపతివ్రత
పతిదర్శనలాలస యై మునుల పలుకులు తలఁచుచు సార్థంబుతో నరిగిన.
| 108
|
| క. |
కడు నెండ యెక్కు నంతకు
నుడుగక యచ్చనుప నడచి యుగ్రాటవిలో
విడిసె బహుశీతజలముల
బెడఁగగు నొకచెఱువునొద్దఁ బెద్దయు డస్సిన్.
| 109
|
| సీ. |
అర్థరాత్రము నప్పు డందుల కేతెంచె
గజయూథములు జలకాంక్షఁ జేసి
యంబుధివిమలతోయంబు లాస్వాదింపఁ
జనుదెంచు [3]జలధరసమితి యట్ల;
యచ్చన్పలోన నిద్రాసక్తులైనవా
రున్నతద్విపముల యుగ్రపాద
హతిఁ జేసి మర్దితు లైరి కొందఱు; దంత
హతిఁ జేసి భిన్నాంగు లైరి కొంద;
|
|
| ఆ. |
ఱఱచి ప్రాణభీతిఁ బఱచి మహీజంబు
లెక్కి రందుఁ గొంద ఱుక్కడంగి;
చనుప యిట్టిపాటఁ బెనుపఱి, యవినీతు
సిరియుఁబోలె నడఁగి విరిసి చనియె.
| 111
|
| వ. |
అట్టి సంక్షోభంబున మరణంబునకుఁ దప్పి దమయంతి యాత్మగతంబున.
| 112
|
| ఆ. |
“[4]జీవితార్థులైన జీవుల సుఖసుప్తు
లైన వారిఁ జంపె నఱవ నఱవ;
మరణకాంక్ష నున్న మగువఁ జంపక నను
మఱచె విధికరంబు మందబుద్ధి.
| 113
|
| సీ. |
ఇచ్చన్పతోఁ జని యివ్వనక్లేశంబు
దలుగుదు నని బుద్ధిఁ దలఁచి యున్న,
నురుతరసార్థపయోరాశి హస్తియూ
థాగస్త్యుచేఁ బీత మయ్యె నదియుఁ;
దొలుమేనఁ జేసిన దుష్కృతశక్తియో
వగవక నా స్వయంవరము నాఁడు
సురవరు లర్థులై చూచుచు నుండఁగ
నలు వరియించిన నాఁటి యెగ్గు
|
|
| ఆ. |
దలఁచి యిట్టి యాపదలు సేసిరో వేల్పు!
లమరకోపమునన యయ్యె నాకు
నివ్వియోగదుఃఖ; మింకేమి సేయుదు?”
ననుచు వగచుచుండె నంబుజాక్షి.
| 114
|
దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట
| వ. |
ఇట్లు దుఃఖించుచు దమయంతి ప్రభాతంబ [5]హతశేషులైన యచ్చనుపలోని
బ్రాహ్మణవరులతో ననవరతప్రయాణంబులం జేదిపతిపురంబు సొచ్చి జనసంకులం
|
|
- ↑ బతినోసి; బతిరోసి; బతి నొచ్చి ... యేకాంతిక నై
- ↑ మారుతంబు దూరదు దీనిన్(నన్)
- ↑ జలధరసమితి యనఁగ ... వా రురుతరద్విపముల ... ఱుఱక ప్రాణభీతిఁ ... లెక్కి రందు కొంద ఱక్కజముగ
- ↑ జీవితాశు లైన
- ↑ హతశేషు లైనవారల