Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.⁠

“ఇంక నైన నన్ను నేల యాలింపవు?
నాకు శరణ మగుము నాథ!” యనుచు
నఱచుచున్న దాని యాక్రందనధ్వని
వినుచు నొక్క యెఱుకు వేగ వచ్చి.

⁠ 88


వ.⁠

తన[1]పట్టినసురియ న ప్పెనుఁబామువదనంబు వ్రయ్యం దఱిగిన రాహుముఖవిము
క్తయైన చంద్రరేఖయుబోలె నజగరముఖంబువలన వెలువడిన యాదమయంతి
నాశ్వాసించి తత్సమీపసరోవరస్నాతను, వన్యస్వాదుఫలాహారనుంగాఁ జేసి విగత
శ్రమం గావించి “నీవెవ్వరిదాన? విట్లేల యేకతంబ యివ్వనంబునకు వచ్చి?” తని
యడిగి మధురభాషిణి యైన యమ్మగువవలన నంతవృత్తాంతంబు నెఱింగి.

⁠ 89


కవిరాజవిరాజితము.⁠

రజనికరాననఁ, బీనపయోధర, రజితరాజసుతన్ విలస
ద్గజపతిగామినిఁ, జందనగంధిఁ, బ్రకాశితకాంతిసమన్వితఁ, బం
కజదళలోచనఁ జూచి కిరాతుఁడు కామనిశాతశరాహతుఁ డై
నిజహృదయం బెఱిగించె లతాంగి కనింద్యచరిత్రకు వేడుకతోన్.

⁠ 90


ఆ.⁠

అగ్నిశిఖయుఁబోలె నంటను, డాయను,
[2]జూడ రానియట్టి శుభచరిత్ర
నెఱుక లేనికఱకుటెఱు కపేక్షించెఁ గా
దనక తనకు నాయు వల్పమైన.

⁠ 91

దమయంతి శాపంబునం గిరాతుండు చచ్చుట

వ.⁠

దమయంతి వాని నలిగి చూచి “యేను పతివ్రత నైతినేని, యిద్దురాత్ముం
డైన కిరాతుం డిప్పుడ మృతుం డయ్యెడు” మని శాపం బిచ్చిన వాఁ డప్పుడ యగ్ని
దగ్ధం బైన వృక్షంబునుంబోలె విగతజీవుం డై పడియె నట్లు పరమపతివ్రతా
గుణప్రభావంబున.

⁠ 92


క.⁠

[3]బాల హృదయమున నృపశా
ర్దూలు నిజాధీశు నిలిపి దుష్టోరగశా
ర్దూలాభీలమృగావలి
కోలిన భయ మంద కరిగె నుగ్రాటవిలోన్.

⁠ 93


వ.⁠

మఱియును.

⁠ 94


సీ.⁠

సహకార! మత్ప్రియసహకారుఁ, బున్నాగ!
                 పున్నాగుఁ, దిలక! భూభువనతిలకుఁ,
జందన! బుధహరిచందనుఁ, బుష్పితా
                 శోక! సుహృజ్జనశోకదమను,
వకుళ! కులైకదీపకు, విభీతక! భయో
                 పేతార్తిహరు; నలుఁ బ్రీతితోడఁ
గానరే కానలలోన లోకోత్తరు”
                 నని మ్రానిమ్రానికి నరిగి యరిగి

⁠


ఆ.⁠

యడుగు; నడుగు లెండ [4]బొడవొడఁ బొక్కిన
నిర్ఝరాంతరముల నిలుచుఁ; బిలుచు
గిరుల దరుల యెడల; నురుగుహాగృహములఁ
దొంగితొంగి చూచుఁ దోయజాక్షి.

⁠ 95


వ.⁠

ఇట్లు దమయంతి నిజనాథు నన్వేషించుచు భీషణారణ్యంబునం దిరుగునది ముందట.

⁠ 96


మత్తకోకిలము.⁠

వారిభక్షులు, పర్ణభక్షులు, వాయుభక్షులు, శాకనీ
వారభక్షులు, వృక్షమూలనివాస[5]యుక్తులునై తపం

⁠ 97
  1. ↑ కట్టినసురియ
  2. ↑ జూడఁగానియట్టి
  3. ↑ బాలకి మనమున
  4. ↑ బొడవడఁ బొక్కిన ... నిలుచుఁ బిలుచు (బొగులు) ... నురుగృహాంతరములఁ
  5. ↑ సక్తులు