Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

ఇ ట్లనేకమాసంబులు దుర్వ్యసనాసక్తుం డయిన యన్నలుండు వివిధవస్తువాహ
ననివహంబు లొడ్డి, పుష్కరున కోటు వడంబోయిన నెఱింగి, పౌరబ్రాహ్మణప్రధాన
వరులు దమయంతీపురస్కృతు లయి వచ్చి వారించి కలిసమావేశపరవశుం డైన
యన్నలుచేతం బ్రతిహతు లయి పలుకకుండి; రంత దమయంతి చింతాక్రాంతా
చిత్త యై.

⁠ 62


ఆ.⁠

“ఎంతయోటు వడిన నంతియ జూదంబు
నందుఁ దగులుఁ, జలము నతిశయిల్లు;
నేమి సేయుదాన? నిది యెగ్గునకు మూల”
మని లతాంగి దుఃఖితాత్మ యగుచు.

⁠ 63


సీ.⁠

అక్షముల్ పుష్కరునందు వశ్యంబులై
                 యునికియు, నలునియం [1]దొండువిధము
లగుటయు నెఱిఁగి నిజాధీశ్వరున కప
                 జయము కా లక్షించి, సరసిజాక్షి
భర్త యనుజ్ఞమున్ బడసి, వార్ష్ణేయుఁడన్
                 సారథిఁ బిలిచి, “యీస్యందనమున
నింద్రసేనుం డను నిక్కుమారకు, నింద్ర
                 సేన యన్కూఁతుఁ జెచ్చెరను దోడు

⁠


ఆ.⁠

కొని విదర్భ కరిగి, గుఱుగొని మద్బంధు
జనులయొద్దఁ బెట్టి [2]చట్ట రమ్మ
యంచు నెమ్మిఁ బుచ్చె నాప్తపురోహిత
మంత్రి బాంధవాభిమతము గాఁగ.

⁠ 64


క.⁠

నలుఁడును ధరణీరాజ్యము
[3]దలఁగఁగ, సర్వంబు నపహృతంబైనఁ, గడుం
దలరి దమయంతిఁ దోడ్కొని
వెలువడియె నశేష రాజ్యవిభవచ్యుతుఁ డై.

⁠ 65


తే.⁠

పురము వెలి మూఁడహోరాత్రములు వసించి
యున్న నలుపాలి కెవ్వరు నోడి రరుగ
జనవిభుం డైన పుష్కరు శాసనమున
గలికృతద్యూతవిద్వేష కారణమున.

⁠ 66


వ.⁠

ఇట్లు సర్వజనసత్కారార్హుం డయ్యును నలుండు విధికృతంబున నెవ్వరివలనను
సత్కారంబు గానక జలంబు లాహారంబుగాఁ దత్పురసమీపంబున దమయంతీ
ద్వితీయుం డై యుండి బుభుక్షాపీడ సహింపనోపక హిరణ్యపక్షంబులతోఁ దమ
ముందటఁ దిరుగుచున్న పక్షులంగని యవి భక్ష్యంబు లగునని, యప్పక్షులం
బట్టికౌన సమకట్టి తనకట్టిన పుట్టంబు వానిపై వైచిన నవి పుట్టంబుతోన గగ
నంబున కెగసి నగుచు విగతవస్త్రుం డైన నలునకి ట్లనియె.

⁠ 67

నలుండు దమయంతీసహితుం డై యడవికిఁ బోవుట

తే.⁠

“నీ ధనంబును రాజ్యంబు నికృతిఁ గొన్న
యక్షముల మేము; నీ వస్త్ర మపహరింపఁ
బక్షిరూపుల మై వచ్చి పార్థివేంద్ర!
యపహరించితి” మని చెప్పి యరిగెఁ జదల.

⁠ 68


వ.⁠

నలుండును వానిం జూచి విస్మయం బంది “యీ[4]యక్షంబుల దోషంబునం
గాకేమి నా కిట్టి దయ్యె” ననుచు దమయంతి కట్టిన పుట్టంబు చెఱంగు గట్టికొని
యె; నట్లిద్దఱు నేకవస్త్రులయి యొండొరులమొగంబులు సూచి దుఃఖించుచో
నలుండు దమయంతి కి ట్లనియె.

⁠ 69


క.⁠

“ఇది దక్షిణాపథంబున
కిదియు విధర్భాపురమున, కిది కోసల, కి

⁠
  1. ↑ దొండుగుణము
  2. ↑ చట్ట రమ్మ, యనుచు ననిచి పుచ్చె ... మతము సేసి; చెప్పిరమ్మయంచుఁ బుచ్చిపంచె ... గూడ
  3. ↑ దలువుగ; దలుపుగ; నలుపుగ
  4. ↑ యక్షప్రకోపంబునం గా కేమి ... గప్పికొనియె