Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

ఆయుధీయసురక్షితం బయిన రాజగృహం బెట్లు సొర నగు నని శంకింపవలవదు;
దమయంతీనివేశంబు ప్రవేశించునపుడు ని న్నెవ్వరు వారింపనోడుదు” రనిన
శక్రువచనంబుల నశంకింతుండయి నలుం డప్పుడ విదర్భాపురంబునకుఁ బోయి
యొక్కరుండ దమయంతీగృహంబు సొచ్చి.

⁠ 38

నలుఁడు దమయంతియొద్దకు దేవదూత యై పోవుట

సీ.⁠

హంసచేఁ దన వినినంతకంటెను రూప
                 విభవాతిశయమున [1]వెలయుదాని,
సురకన్యకలయట్టి సురుచిరశతకన్య
                 కాళిచేఁ బరివృత యైన దాని,
హృదయేశుఁ డైన త న్నెప్పుడు వినుచున్కి
                 నలయ కాశ్వాసిత యైన దాని,
దమయంతిఁ జూచి కందర్పశరావిద్ధుఁ
                 డయ్యె నలుం; డంత నతనిఁ జూచి

⁠


ఆ.⁠

[2]యితఁ డపూర్వమనుజుఁ డెందుండి వచ్చెనో
యనుచు నుదరిపడి లతాంగు లెల్ల
నాసనములు డిగ్గి యప్పు డభ్యుద్గత
లైరి మనములందు హర్ష మెసఁగ.

⁠ 39


వ.⁠

అంత.

⁠ 40


క.⁠

దమయంతి మనోభవనిభు
నమరేంద్రప్రతిము, దినకరాభు, [3]సుధారుక్
సము, వరుణసదృశు, ధనదో
పము, నశ్విసమాను, నిషధపతిఁ జూచి నలున్.

⁠ 41


క.⁠

వారిరుహనేత్ర మదన
ప్రేరిత యై లజ్జ యుడిగి భీతిల్లక బృం
దారకమూర్తికి రాజకు
మారున కి ట్లనియె మందమందమృదూక్తిన్.

⁠ 42


వ.⁠

“నీవు మహానుభావుండ వెవ్వండ? విందుల కేమి కారణంబున నేకతంబ వచ్చితి? విది
యత్యుగ్రశాసనుం డైన మదీయ జనకుచేత సురక్షితం బగుట నెవ్వరికిఁ జొర నశ
క్యంబు; దీని నెవ్వరు నెఱుంగకుండ నెవ్విధంబునం జొచ్చితివి? నాకు మనోజవేద
నావివర్ధనుండ వైన నీ తెఱం గెఱింగింపు” మనిన దానికి నలుం డి ట్లనియె.

⁠ 43


ఆ.⁠

“ఏను దేవదూత; [4]నింతి! నలుండను
వాఁడ; నింద్రదహనవరుణయములు
నీ స్వయంవరంబు నెమ్మితోఁ జూడంగ
నరుగుదెంచి నన్ను నబల! మున్న.

⁠ 44


క.⁠

నీ యొద్దకుఁ బుత్తెంచిరి
“మాయం దొక్కరు నభీష్టమతి వరియింపం
దోయజముఖిఁ బ్రార్థింపుము;
మాయందఱకును [5]బ్రియం బమర్పుము ప్రీతిన్.”

⁠ 45


వ.⁠

అనిపంచినఁ దత్ప్రసాదంబున నన్యులచేత నలక్షితుండనై వచ్చితి నింద్రాదు
లకుఁ బ్రియంబు సేయు” మనిన నవనతవదనయై దమయంతి దొల్లి హంసచేత
నలు విని వానియందు బద్ధానురాగయై నవయుచున్న యది యపు డతని నలుం
గా నెఱింగి తద్వచనశ్రవణదుఃఖాయమానమానస యగుచు ని ట్లనియె.

⁠ 46


తరువోజ.⁠

“[6]ఏనేడ? నింద్రాదు లేడ? వారలకు
                 నెప్పుడు మ్రొక్కుదు; నేను నీధనమ;

⁠
  1. ↑ వ€లుఁగుదాని ... నలయ కుచ్ఛ్వాసిత; నలఁత కుచ్ఛ్వాసిత; నలఁతకు నాస్పద
  2. ↑ యితఁ డపూర్వమదనుఁ డెందుండి వచ్చెనో
  3. ↑ సుధాభూ; సుధాభృ
  4. ↑ నింతేల నలుఁడను; నిమ్మహి నలుఁడను
  5. ↑ బ్రియం బొనర్పుము ప్రీతిన్
  6. ↑ ఏ నేల నింద్రాదు లేల