Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.⁠

అట విదర్భాధిపుఁ డైన భీముం డను
                 వాఁ డనపత్యుఁ డై, వ్రతము లోలి
సలుపుచు, దమనుఁ డ న్సన్మునిఁ బత్నియుఁ
                 దాను నుపాసించి, తద్వరమున
దమయంతి యనుకూఁతు, [1]దమదాంతదమను ల
                 న్సుతులను బడసె విశ్రుతగుణాఢ్యుఁ;
డందుఁ గన్యారత్న మగు దమయంతి దా
                 నత్యంతకాంతిరూపాభిజాత్య

⁠


ఆ.⁠

విమలగుణసమృద్ధి వెలుఁగుచు సురసిద్ధ
సాధ్యకన్య లట్టిసఖులు నూర్వు
రొలసి తన్నుఁ గొలుచుచుండఁగ మహి నొప్పు
చుండె నధికవిభవయుక్తి[2]తోడ.

⁠ 8


వ.⁠

అంత.

⁠ 9


క.⁠

నలుగుణములు దమయంతికి
నలునకు దమయంతిగుణగణంబులు జను లి
మ్ములఁ బొగడుట నిరువురకును
వెలసె మనోభవవికారవిభ్రమ [3]మెదలన్.

⁠ 10


వ.⁠

ఒక్కనాఁడు నలుఁడు దమయంతీగుణబద్ధచేతస్కుం డై మదనానలంబు [4]సహింప
నోపక, ప్రమదవనంబున నుండునంత నంతరిక్షకాంతాహారావళియుంబోలె
హంసావళి యవనీతలంబున కవతరించిన.

⁠ 11


ఆ.⁠

వీరసేనసుతుఁడు [5]వీరుండు హంసల
నడబెడంగుఁ జూచి, నగుచు, వాని
నెగచి యెగచి యందు నెగయకుండఁగ నొక్క
హంసఁ బట్టుకొనియె నతిరయమున.

⁠ 12


ఆ.⁠

దాని విడిచి పోవఁ[6]గా నోప కఱచుచు
నంతరిక్షమునను హంసలెల్లఁ
బిండుగట్టి తిరుగుచుండె వాతోద్ధూత
శారదాభ్రశకలచయముఁబోలె.

⁠ 13


వ.⁠

అదియును దన కమ్మనుజేశ్వరుఁ డపాయంబు [7]సేయుంగా వగచి, మనుష్యవాక్యం
బుల ని ట్లనియె: “నయ్యా! యేను నీకుం బ్రియంబు సేసెద; నీహృదయేశ్వరియైన
దమయంతిపాలికిం బోయి నీగుణంబులు దానికి వర్ణించి, యక్కన్య యన్యుల
నపేక్షింపక నీయంద బద్దానురాగ యగునట్లుగాఁ జేసెద.”

⁠ 14


క.⁠

అనిన విని హంస పలుకులు
దన హృదయంబునకు [8]నమృతధారాపాతం
బునుబోలెనైన నృపనం
దనుఁ డనురక్తుఁ డయి విడిచెఁ దడయక దానిన్.

⁠ 15


వ.⁠

హంసపిండుతో నదియును విదర్భాపురంబునకుం బఱచి యం దుపవనంబున సఖీజన
పరివృతయై యున్న దమయంతి యంతికంబునకు వచ్చి విహరించుచుండె నంత
[9]వానిం జూచి పరమకౌతుకమ్మున.

⁠ 16


తే.⁠

ఒండొరులఁ గడవంగ నయ్యువిదలెల్లఁ
బఱచి యొక్కొక్క[10]కలహంసఁ బట్టికొనఁగఁ
జెలువముగ నందు దమయంతిచేతఁ బట్టు
వడియె నలుచేత విడువంగఁ బడిన హంస.

⁠ 17


క.⁠

దమయంతికి నలునకు సం
గమకారణదూతయైన కలహంస మనో

⁠
  1. ↑ దమనాంతదమను లన్సుతు
  2. ↑ ఁజేసి
  3. ↑ మడరన్
  4. ↑ శమింపనోపక; సైరింపనోపక ... గ్రుమ్మరువాఁ డంతరిక్ష ... బోలె నత్యంతశుభ్రవర్ణశోభితం బై హంసావళి
  5. ↑ వీరుండు నలుఁ డంత, నడ బెడంగక ... యంచఁ బట్టికొనియె
  6. ↑ గా జాల కఱచు
  7. ↑ సేయునో యని వెఱచి వగచుచు మనుష్య
  8. ↑ నమృతధారాసారం ... దద్దయు దానిన్
  9. ↑ నాహంసంబులం జూచి
  10. ↑ హంసంబు బట్టికొనఁగఁ ... బడినయంచ