Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

సత్యభంగభీతుండవు గావున నీ వింద యుండి, పదుమూడేండ్లుం జలిపి పదంపడి
కరిపురంబునకు వచ్చి రాజ్యాభిషిక్తుండ వగుము; దుష్టద్యూతంబున మనరాజ్యం
బపహరించిన సుయోధనుండు సుచిరప్రతిష్ఠితుండు కాకుండ, నిప్పుడ యద్దురాత్ము
దూషింతుము; నికృతిపరుల నికృతినచేసి నిర్జించినఁ బాపంబు లేదు; సర్వప్రకారం
బులను శత్రువుల జయించి రాజ్యంబు సేకొనుట రాజులకు విధిచోదితం బైన
రాజధర్మంబ” యనిన భీమసేను మహాసంరంభంబునకు సంతోషించి ధర్మ
నందనుం డాతనిం దనపైకిం దిగిచికొని [1]మూర్దాఘ్రాణంబు సేసి యి ట్లనియె.

⁠ 395


తే.⁠

“అనలునకు గాడ్పు దో డైన యట్టు లింద్ర
తనయునకు నీవు దో డైనఁ దడయ కాజి
[2]బోర రిపులకు బ్రతుకంగఁ బోలదైన
ననఘ! యిది కోపమునకు ననవసరంబు.

⁠ 396


క.⁠

పదుమూఁడేండ్లుం బోయినఁ
బదపడి పార్థుండు నీవుఁ బరనృపతుల దు
ర్మదుల వధియించి విజయా
స్పదబాహుల రగుఁడు ధర్మపరిరక్షకులై.

⁠ 397


వ.⁠

ఏ నెట్లును సత్యభంగంబు సేయుట కొడంబడ నోప” నని ధర్మతనయుం డనుజు
ననునయించె; నని జనమేజయునకు వైశంపాయనకథితం బైన పుణ్యకథ యతి
రమణీయంబుగాను.

⁠ 398


క.⁠

బిరుదాంకభీమ! భీమే
శ్వర[3]కృతకృత్యప్రసాద! సౌజన్యగుణా
భరణ! పరగండభైరవ!
పరనృపమణిమకుటఘటితపద! బుధవినుతా!

⁠ 399


ఉత్సాహము.⁠

రాజవంశరత్న! రాజరాజ దేవ! నిత్యల
క్ష్మీజయాభిరామ! ధర్మమిత్ర! మిత్రవిద్వదం
భోజవనపయోజమిత్ర! భూరికీర్తికౌముదీ
రాజితత్రిలోక! నిఖలరాజలోకపూజితా!

⁠ 400


గద్యము.⁠

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతంబైన శ్రీమహాభారతంబునం
దారణ్యపర్వంబునందుఁ బాండవవనప్రవేశంబును, గిమ్మీరవధయును, గృష్ణ
పాంచాలాభిగమనంబును, సౌంభకాఖ్యానంబును నింద్రకీలాభిగమనంబును,
గైరాతంబును, నర్జునుతపశ్చరణంబును, నీశ్వరుతోడ యుద్ధంబును, బరమేశ్వ
రుచేతఁ బాశుపతాస్త్రంబు వడయుటయు, లోకపాలసందర్శనంబును, స్వర్గ
గమనంబును, నూర్వశి శాపంబును, దేవతలవలన దివ్యాస్త్రలాభంబును నన్నది
ప్రథమాశ్వాసము.

⁠

—————

  1. ↑ మూర్థ్విఘ్రాణంబు
  2. ↑ బొనరి రిపులకుఁ బ్రదుకంగ బోల దైన, ననఘ నిది కోపమునకు ననవసరంబు
  3. ↑ కృతనిత్యప్రసాద.....పదవిబుధనుతా