Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

మత్తమధుకరగానమనోహరస్థలంబులను, మేరుశైలకందరంబులను, మందపవ
నంబులు గల నందనాదివనంబులయందును, నితాంతకాంతవికసితకనకారవింద
సమధికసౌరభసంవాసితమహానందకందంబు లైన మందాకినీతీరమణిమయవేది
కలయందును, జంద్రికాసుందరంబు లైన సికతాతలంబులను, మఱియు నిర్జర
విహారస్థానంబుల ననవరతసురతకేళీసౌఖ్యాంబుధి నన్ను నోలలార్పు” మనిన
[1]నిర్వికారధైర్యధుర్యుం డై యర్జునుం డి ట్లనియె.

⁠ 363


క.⁠

“ఓహో! యిమ్మెయి ధర్మ
ద్రోహోక్తులు పలుకఁ దగునె? దోసం బదిగా
దే? హరి హరి; మనమునఁ దగ
వూహింపక నన్నుఁ బలుకు టుచితమె నీకున్.

⁠ 364

ఊర్వశి యర్జును నపుంసకునిఁగా శపించుట

వ.⁠

జగంబులు వుట్టింపను మనుపను సమయింపను గర్తలైన దేవతలకు నెట్లు నడచిన
నెగ్గు లేదు; నేను గర్మభూమిని జనియించి [2]కర్మఠుండ నైతి; నాకు [3]నిచ్చటి యాచా
రం బుచితంబు గాదు; మదీయవంశకర్తయైన పురూరవునకుఁ బత్నివైన కార
ణంబునను, బురందరునకుఁ బరిచర్య యొనర్చుటను నాకు జనని వగుట సంది
యంబు లేదు; తల్లీ! నన్నుం బుత్త్రవాత్సల్యంబునం జూడు” మనిన మదనబాణ
పీడితయై కోపారుణితనయనంబుల నర్జునుం జూచి యూర్వశి “యేను గామించి
వచ్చిన నామనోరథంబు విఫలంబుఁ జేసినవాఁడవు, నీవు మర్త్యలోకంబున
మానవర్జితుండవై, మానినీమధ్యంబున నపుంసకుండవై యుండు” మని శాపం
బిచ్చి నిజగృహంబు నకుఁ జనియె; నంతఁ బ్రభాతసమయంబునఁ దద్వృత్తాంతం
బంతయు విని సురపతి కొడుకున కి ట్లనియె.

⁠ 365


క.⁠

“నీయట్టి ధైర్యవంతుని
నేయుగములనైనఁ గాన మెన్నండును; ధ
ర్మాయత్తమతివి; మునులకు
నీయింద్రియజయము గీర్తనీయము తండ్రీ!

⁠ 366


తే.⁠

అనఘ! యూర్వశి యిచ్చిన యట్టిశాప
మనుభవింపంగవలయు నీకవనియందు;
నింక మీ పదుమూఁడవయేఁడు సత్య
సరణి నజ్ఞాతవాసంబు సలుపవలయు.

⁠ 367


వ.⁠

అక్కాలంబున నీవు షండరూపంబునఁ బ్రచ్ఛన్నుండవై రాజకన్యకలకు నృ
త్యంబు గఱపుచుండి తదంత్యంబున శాపమోక్షంబు వడయు” మని యనుగ్రహిం
చె; నీయాఖ్యానంబు విన్న పుణ్యపురుషులు సకలదురితవిముక్తు లగుదు రని చెప్పి
వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె.

⁠ 368


సీ.⁠

వజ్రాస్త్ర మాదిగా [4]వరదుఁ డై వివిధది
                 వ్యాస్త్రముల్ పార్థున కమర నిచ్చి
తత్ప్రయోగంబులుఁ దద్రహస్యంబులుఁ
                 దన్నివర్తములుఁ దడయ కపుడు
దయ నుపదేశించి, “దారుణాహవములం
                 దవిజేయవీర్యుండ వగుము పేర్మి”
నని మహాసౌహార్దుఁ డై చిత్రసేనుఁ డ
                 న్గంధర్వపతితోడ గారవమున

⁠
  1. ↑ నిర్వికారధైర్యధుర్యుం డైన
  2. ↑ సత్కర్మపరుండ నైన
  3. ↑ నిచ్చట నాచారం
  4. ↑ వరదుఁడు (వరదుండు) దివ్యాస్త్రములు పార్థునకు వేడ్క మొనయ నిచ్చి