Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

త్పాలకుఁ డంటుచు నుండె గు
ణాలంకృతుఁ డైన పార్థు నంగముఁ బ్రీతిన్.

⁠ 355


వ.⁠

ఇ ట్లధికవిలాసంబుతో సురవిలాసినీకరకలితచారుచామీకరదండచామరసమీ
రాలోలకుంతలుం డగుచు సురరాజుతో నేకాసనంబున నున్న యప్పార్థుం బాక
శాసనుశాసనంబున దేవగంధర్వసిద్ధవిద్యాధరు లతిప్రీతి [1]నర్చించి రంత.

⁠ 356


[2]తే.⁠

పాకశాసనుపనుపునఁ బార్థుఁ డొక్క
మణిమయం బైన మహనీయమందిరమున
నెలమి గంధర్వసంగీతహృద్యగోష్ఠి
నుండెఁ జెవులకు నుత్సవం బొందుచుండ.

⁠ 357


వ.⁠

అంత సూర్యాస్తమయసమయంబునఁ జంద్రుఁ డుదయించి సాంద్రచంద్రికా
విలాసంబున దిగ్వనితల నలంకరించుచుండ, నిలింపపతి పంపున సొంపార నూర్వశి
[3]యర్జునసంగమకాంక్షం జేసి, చంద్రికాధవళదుకూలంబు గట్టి, మృగమదకర్పూర
కుంకుమోన్మిశ్రితసుగంధం బలఁది, వివిధసురభికుసుమవిసరంబులు ముడిచి, మణి
మయభూషణాలంకృతయై నిలుకడ వడసిన క్రొమ్మెఱుంగుఁదీఁగయుంబోలె మణి
మయమంజీరఝళంఝళనినాదంబును, గంకణఝణఝణత్కారంబును, గటిక
లాపకింకిణీక్రేంకారంబును, మదనాజ్ఞావాద్యఘోషంబునుం బోలె మ్రోయు
చుండ మందగమనంబునఁ బురందరనందను మందిరంబున కరుగుదెంచిన నప్పు
రుషసత్తముండు భయభక్తిసంభ్రమంబులతోఁ బ్రత్యుత్థానంబును దండ
ప్రణామంబునుం జేసి కరకమలంబులు మొగిచి యి ట్లనియె.

⁠ 358


క.⁠

“ననుఁ బుత్త్రస్నేహంబున
మనమున మన్నించి శుభసమగ్రునిఁ జేయం
జనుదెంచి తీవు ముదమున
జనయిత్రీ! యేఁ గృతార్థజన్ముఁడ నైతిన్.”

⁠ 359


తే.⁠

అనిన నూర్వశి యిట్లను [4]నాత్మనేత్ర
మధుపము లతని సౌందర్యమధువు గ్రోలు
చుండఁ దమకంబు మీఱి యనూనధర్మ
నిపుణుఁ డగు నర్జునునితోడ నెయ్య మొనర.

⁠ 360


చ.⁠

“అనుపమశౌర్య! నీదు సముదగ్రగుణంబులు నారదాదిస
న్మునివరు లెల్లఁ జెప్పఁగఁ బ్రమోదమునన్ భవదీయసంగమం
బనిశముఁ గోరుచుం దగఁ బ్రియంబున వచ్చితి; నేను గోరఁగా
నను [5]జనయిత్రి వంచు నొకనాయము బల్కెద వక్రభాషలన్.

⁠ 361


తే.⁠

నీకు నేనాఁటి తల్లిని? నిజము సెపుమ;
యమరలోకంబు వేశ్యలమైన మాకు
నిట్టి తగవులు నడవ; వహీనబాహు
వీర్య! యిచ్చట [6]వావియే వెదకఁ జనునె.

⁠ 362


వ.⁠

ఈలోకంబున వనితలుఁ, బురుషులు విచ్చలవిడిఁ గ్రీడింతు; రిచ్చటి కిది యనిందితం
బైన యాచారంబు; నీవును ద్రిదివంబునకు వచ్చిన యప్పుడ దివ్యపురుషుండవు;
గావున నా మనోరథంబు సఫలంబుగా మందార[7]మంజులమంజరీమకరందపాన

⁠
  1. ↑ నగ్గించి
  2. ↑ 357 వ పద్యము మొదలు 368 వచనమువఱ కొక్కతాళపత్రప్రతియందును, ఒక్కకాకితపుప్రతియందుమాత్రము గలదు.
  3. ↑ సంగమాకాంక్షం జేసి
  4. ↑ దనదునేత్ర, మధుపముల నతిసౌందర్య ... యఖండధర్మ ... నెయ్య మలర
  5. ↑ జనయత్రి యంచు
  6. ↑ వావియు వెదకఁ జనునె
  7. ↑ మంజరీమంజుల