Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.⁠

నీయందలి పుణ్యతీర్థంబులు సేవించుచు, గంగాంబు[1]ధ్యౌతస్థలరుహవనస్పతిఫలం
బు లుపయోగించుచు సుఖం బుండితి; నమరావతికిం బోయి వచ్చెద” నని మందర
నగంబు వీడ్కొని పురందరనందనుండు దేవపథంబున కరిగి.

⁠ 347


సీ.⁠

పరమధర్మస్థితిఁ బ్రజఁ బ్రీతిఁ గాంచిన
                 రాజులకు నుదగ్రరణమునందుఁ
బతుల ప్రస్తవమునఁ బ్రాణముల్ విడిచిన
                 వీరులకును, యజ్ఞవిధులఁ జేసి
సురలను వసుమతీసురులను దనిపిన
                 ధర్మాత్ములకు, మహాతాపసులకు,
నిలయంబు లై రమణీయంబు లగు[2]రమ్య
                 హర్మ్యవిమానసంహతులదాని

⁠


తే.⁠

సకలభువనంబులం గలసత్పురముల
కెల్ల [3]నుపమాన మై దహనేందురవుల
దీప్తి లే కున్నఁ దన దైన దివ్యదీప్తి
విస్తరంబున నెప్పుడు వెలుఁగుదాని.

⁠ 348


వ.⁠

మఱియు ననాహితాగ్నులకు, నతీర్థసేవకులకు, ననృతవాదులకు, వేదవిరుద్ధా
చారులకు, మాంసాహారులకు, రణపరాఙ్ముఖులకుఁ జొర నవిషయంబును నతి
గహ్వరంబును నైనదాని నమరావతిఁ జొచ్చి, తద్గోపురసమీపంబున ననవరత
గండస్థలగళదవిరళమదజలకుల్యాభిరామం బై నిరంతరనిర్ఝరనీహారనగంబునుం
బోలె నొప్పుచున్న నైరావతంబుఁ జూచుచు సురసిద్ధసాధ్యగణంబుతో విద్యాధరా
ప్సరోగంధర్వకిన్నరజేగీయమానుం డగుచు జను నప్పుడు.

⁠ 349


క.⁠

[4]సకలర్తుకుసుమసౌరభ
సుకుమారోద్యానతరుల సుడియుచుఁ బ్రణయో
త్సుకుఁ డై పవనుఁడు పాండవు
నకు నభిముఖుఁ డయ్యెఁ దన్మనఃప్రియ మెసఁగన్.

⁠ 350


క.⁠

నరుఁ డైన యాదిముని యని,
హరిసుతుఁ డని, హరిసహాయుఁ డని, హరుచేతన్
వరములు వడసినవాఁ డని
సుర లెల్లను వచ్చి పార్ధుఁ జూచిరి ప్రీతిన్.

⁠ 351


వ.⁠

అర్జునుండు నయ్యమరావతివిభవంబు చూచి హర్షించుచు నప్సరోగీయమాన
[5]మంగళహితగీతావహితమానసుం డగుచు, సిద్ధమునిగణాశీర్వాదంబులు సేకొ
నుచుం జని మాతలి నిర్దేశంబున దివ్యరథావతీర్ణుం డై.

⁠ 352


క.⁠

శతమఖునకు, భువనావన
రతశీలున, కఖిల దేవరాజర్షి సమ
న్వితునకు, [6]వజ్రాభిహితో
న్నతపృథుభుజునకుఁ గృతప్రణాముం డయ్యెన్.

⁠ 353


చ.⁠

అనిమిషనాథుఁడుం బ్రచలితాంగదతుంగభుజాయుగంబునం
దనయునిఁ గౌఁగిలించుకొని, తత్క్షణజాతనితాంతసమ్మదం
బునఁ బులకాంకితాంగుఁ డయి, మున్ను నిజాంకతలస్థుఁ జేసి య
త్యనఘు నిజాసనార్థమున [7]నాదట నుంచెఁ గరంబు నెమ్మితోన్.

⁠ 354


క.⁠

లీలైరావతకుంభా
స్ఫాలనకర్కశకరములఁ బలుమరును మరు

⁠
  1. ↑ చ్యోతస్థలీరుహ ... చూచి
  2. ↑ రత్నహర్మ్య
  3. ↑ నెక్కు డనఁదగి శిఖీందురవుల
  4. ↑ సకలర్తుసురభికుసుమిత ... నభినుతుఁ(గతుఁ) డయ్యె
  5. ↑ మంగళగీతమహితమానసుం డగుచు
  6. ↑ వజ్రాభీలో, న్నత
  7. ↑ నప్పుడ నుంచెఁ గరంబు; నాతని నుంచెఁ గరంబు