| |
డై యక్షరాక్షసగణంబుతో నున్నకుబేరునిం జూచి, వారివలన దివ్యాస్త్రం
బులు వడసి [1]వాక్పుష్పఫలజలంబుల నందఱం దృప్తులం జేసి వెండియు.
| 340
|
| ఆ. |
అమరగణసమేతు, [2]నైరావణారూఢు,
వజ్రధరుఁ, ద్రిలోకవంద్యు, నింద్రు,
వృత్రశత్రు, నమరవిభుఁ జూచి యెద నాది
మునివరుండు నరుఁడు ముదము నొందె.
| 341
|
| ఉ. |
ఇందుధరప్రసాదమున నిష్టవరంబులు గాంచి [3]బాంధవా
నందవిధాయి యైన నిజనందను దండితశత్రు సద్గుణా
నందితుఁ జూచి వేడ్క నయనంబులు వేయును గన్న తత్ఫలం
బందెఁ బురందరుండు పరమాద్భుతసమ్మదపూరితాత్ముఁ డై.
| 342
|
| వ. |
ఇట్లు దేవేంద్రుండు ధనంజయుం జూచి సంతసిల్లి “నీవు పరమేశ్వరువలనఁ బరమ
సిద్ధితో దేవత్వంబు వడసితివి; దేవకార్యంబు దీర్ప నర్హుండవు; గాన నారథంబుఁ
బుత్తెంచెద; నమరావతికి రమ్ము; నీకు దివ్యాస్త్రంబు లంద యిచ్చెద” నని దేవేం
ద్రుండు దేవగణంబులతో నమరావతికి నరిగె; నర్జునుండును దద్రథాగమనంబు
ప్రతీక్షించుచుండు నంత.
| 343
|
| సీ. |
[4]వారిదమార్గంబువలన మహానీల
వైజయంతీవిభవంబు వెలయ,
నాబద్ధవివిధరత్నావళిప్రభఁ జేసి
రమ్యమై రోదోంతరంబు వెలుఁగ,
నురునేమిరవమున నుర్వరాధరదరీ
ముఖములు ప్రతిశబ్దముఖరితంబు
లగుచుండ, నానావిధాయుధంబులు దాల్చి
యశనివిద్యుత్సహస్రాభిశోభి
|
|
| ఆ. |
తాభ్రసదృశ మై, మహాజవాశ్వాయుత
వాహ్యమాన మైన వరరథంబు
మఘవునాజ్ఞ జేసి మాతలియుక్తమై
యింద్రతనయుఁ డున్నయెడకు వచ్చె.
| 344
|
| వ. |
మాతలియు నర్జునుఁ జూచి “సురాసురకిరీటతటఘటితరత్నప్రభాభాసురపదుం డైన
మహేంద్రుండు మీయయ్య భవద్దర్శనం బపేక్షించి నిన్ను నమరావతికి రాఁ
బనిచె; రాజసూయాశ్వమేధశతంబులం జేసినవారికైనను దుర్లభం బీరథంబు;
దీని నెక్కు” మనిన నర్జునుండును గంగాస్నానపవిత్రీకృతగాత్రుం డై దేవఋషి
పితృతర్పణంబులు చేసి మాతలిప్రయుక్తం బైన యాదివ్యరథం బెక్కి.
| 345
|
అర్జునుఁ డమరావతికిఁ బోవుట
| చ. |
అలఘుతపస్సమాధినియతాత్ములకున్, బహుపుణ్యలోకకాం
క్షులకు, విశుద్ధమానసులకున్ సతతంబును [5]నాశ్రయంబ వై
లలితనిలింపదంపతివిలాసవిహారమహోత్సవంబులుం
గలిగి వెలుంగు రత్నమయకందరసుందర! మందరాచలా!
| 346
|
- ↑ వాక్పూజనల నందఱం
- ↑ నైరావతారూఢు ... యెడ నాది
- ↑ యంచితా, (పాండవా)నంద(మనోజ్ఞుఁడై)విధాయి యై ... మగ్దితశత్రు ... నప్డు చూచి నయ
- ↑ వరదివ్యమార్గంబు ... మెఱయ ... యశనివిద్యుత్సమూహాభిశోభి ... కరమువేడ్క నరునికడకు వచ్చె
- ↑ సంశ్రయంబ వై ...మందరాచలున్