| క. |
అపహృతగాండీవుఁడు నై
యపరిమితక్రోధహృదయుఁ డన్నరుఁడు పరం
తపుఁ డెఱుకు మస్తకంబునఁ
గృపాణపాతంబుఁ జేసెఁ [1]గిట్టి కడంకన్.
| 316
|
| క. |
అదియు వృథ యైనఁ బార్థుఁడు
వదలక వృక్షముల, రాల, వైచెను రణదు
ర్మదు వనచరు; నవి యెల్లం
దదంగముల నడఁగె నద్భుతంబుగ నంతన్.
| 317
|
| క. |
హరుఁ బెనఁగి పట్టుకొని భీ
కరబలుఁ డర్జునుఁడు ముష్టిఘాతంబుల సం
గర మొనరించెను; వనచర
వరు లాతని శౌర్యగౌరవముఁ [2]బొగడి రెదన్.
| 318
|
| క. |
తనదివ్యగాత్రమున న
ర్జును గాత్రనిపీడఁ జేసె శూలధరుం డం
తన మూర్ఛవోయి పీడిత
తనుఁ డై పార్థుండు ధరణితలమునఁ బడియెన్.
| 319
|
| చ. |
వరదుఁడు పార్థుశౌర్యవిభవంబున, కాతని[3]ధైర్యవృత్తి క
ప్డరుదుగ మెచ్చి సన్నిహితుఁ డయ్యె జటామకుటేందు రేఖయుం,
గరమున శూలమున్, గరళకాలగళంబు, బృహద్గజాజినా
బరముఁ, దృతీయలోచనముఁ, బన్నగహారము నొప్పుచుండఁగన్.
| 321
|
| వ. |
ఇట్లు విరూపాక్షుండు నిజరూపంబుతో నర్జునునకు సన్నిహితుం డై “యర్జునా!
క్షత్రియు లొరు లెవ్వరు నీయట్టి శౌర్యధైర్యవంతు లెందును లేరు; నీతపఃక్షాత్త్రగు
ణంబులకు మెచ్చితి; నీకోర్కి సఫలంబు సేసెద; దేవాసురమానుషం బైన జగం
బంతయు నీవ జయింతు; నాస్వరూపంబు సూడు“ మని దివ్యదృష్టి యిచ్చినం
జూచి పార్థుండు గృతార్థుం డయి దండప్రణామంబు సేసి.
| 322
|
| క. |
వరదు, సురాసురవందితఁ
గరుణాకరు, హరుఁ, బినాకకరుఁ, గరిచర్మాం
[4]బరు, శంకరు, గిరిజాసుం
దరు నిట్లని సంస్తుతించెఁ దద్దయు భక్తిన్.
| 323
|
అర్జునుఁడు పరమేశ్వరుని స్తోత్రము సేయుట
| దండకము. |
“శ్రీకంఠ! లోకేశ! లోకోద్భవస్థానసంహారకారీ! పురారీ! మురారిప్రియా! చంద్ర
ధారీ! మహేంద్రాదిబృందారకానందసందోహసంధాయిపుణ్యస్వరూపా! విరూపాక్షా!
దక్షాధ్వరధ్వంసకా! దేవ! నీదైన తత్త్వంబు భేదించి, బుద్ధిం బ్రధానంబు, గర్మంబు,
విజ్ఞాన, మధ్యాత్మయోగంబు, సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్
బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు; రీశాన! సర్వేశ్వరా! శర్వ!
సర్వజ్ఞ! సర్వాత్మకా! నిర్వికల్పప్రభావా! భవానీపతీ! నీవు లోకత్రయీవర్త
నంబునన్ మహీవాయుఖాత్మాగ్నిసోమార్కతోయంబులం జేసి కావించి; సంసార
చక్రక్రియాయంత్రవాహుండవై; తాదిదేవా! మహాదేవ! నిత్యంబు నత్యంత
యోగస్థితిన్ నిర్మలజ్ఞానదీపప్రభాజాలవిధ్వన్తనిస్సారసంసారమాయాంధకారుల్
|
|
- ↑ గినిసి కడంకన్
- ↑ బొగడంగన్
- ↑ ధైర్యవృత్తికం దరుదుగ
- ↑ బరు గిరిజేశ్వరుఁ బన్నగ, నరు నిట్లని; బరు నీశ్వరు గిరిజాసుం, దరు నిట్లని ప్రస్తుతించెఁ