Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.⁠

భవ్యచరిత్రుఁ, డాపస్తంబసూత్రుండు,
                 శ్రీవత్సగోత్రుండు, శివపదాబ్జ
సంతతధ్యానసంసక్తచిత్తుఁడు, సూర
                 నార్యునకును బోతమాంబికకును
నందనుఁ, డిలఁ బాకనాటిలో నీలకం
                 ఠేశ్వరస్థానమై యెసక మెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు
                 ధన్యుండు ధర్మైకతత్పరాత్ముఁ,

⁠


తే.⁠

డెఱ్ఱనార్యుండు సకలలోకైకవిదితుఁ
డయిననన్నయభట్టమహాకవీంద్రు
సరససారస్వతాంశప్రశస్తి దన్నుఁ
జెందుటయు, సాధుజనహర్షసిద్ధిఁ గోరి.

⁠ 469


క.⁠

ధీరవిచారుఁడు [1]తత్కవి
తారీతియుఁ గొంత దోఁపఁ దద్రచనయ కా
నారణ్యపర్వశేషము
పూరించెఁ గవీంద్రకర్ణపుట[2]పేయముగాన్.

⁠ 470


క.⁠

వీరావతార! విమలా
చార! మహోదార! శుభవిచార! సుజనమం
దార! నవకీర్తిమౌక్తిక
హార! హరపదాబ్జమధుకరాత్మవిహారా!

⁠ 471


తరలము.⁠

అమితవైభవ! లోభమోహమదాదిదుర్లభ! మంజువి
భ్రమ[3]వికాసి విలాసినీజనపంచబాణ! నిరంతరా
నమదశేషనృపాలమౌళిపినద్ధముగ్ధమణిప్రభా
క్రమసమర్చితవిస్ఫురత్పదకాంతినిర్జితపంకజా!

⁠ 472


గద్యము.⁠

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైనశ్రీమహాభారతంబు
నం దారణ్యపర్వంబునందు సీతాన్వేషణంబును, లంకాభిగమనంబును, రామరావణ
యుద్ధంబును, రాఘవాభ్యుదయంబును, సావిత్రిచరిత్రంబును, సూర్యుండు
గర్ణునకు హితోపదేశంబు సేయుటయుఁ, గర్ణుజన్మకథనంబును, విప్రరూపంబునఁ
గర్ణుగవచకుండలంబు లింద్రుండు హరించుటయు, నారణేయంబును, యక్షప్రశ్నం
బులును, ధర్ముండు ధర్మరాజునకు వరంబు లొసంగుటయు నన్నది సర్వంబును
సప్తమాశ్వాసము.

⁠

శ్రీమదాంధ్రమహాభారతమునందలి యారణ్యపర్వము
సమాప్తము.

  1. ↑ సత్కవి
  2. ↑ భేదముగాన్
  3. ↑ విలాసితకామినీజన ... దివ్యమణిప్రభా, క్రమ (సమర్పిత) సమంచిత