Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

డతిశీఘ్రగమనంబునం బోయి, బద్మినీతీరంబునం బడియున్న యన్నతెఱంగుఁ
జూచి, విస్మయశోకవ్యాకులహృదయం డగుచు “నిది యేమి నిమిత్తంబున నయ్యె
నో” యని యూహించుచుఁ, బెల్లడరు తృష్ణాభరంబు సహింపనోపక, జలంబులదెస
నాసఁ జేసి కొలనికి డిగ్గిన నెప్పటిభూతం బి ట్లనియె.

⁠ 393


ఆ.⁠

“అనఘ! యీజలాశయము నాయధీనంబు;
సాహసంబుఁ జేసి చనదు చొరఁగ;
నాదుప్రశ్నములకు నలి నుత్తరము లిచ్చి,
వారి గొనుము నీకు వలసినట్లు.”

⁠ 394


క.⁠

అనిన నది యాదరింపక
ఘనుఁ డాసలిలములు ద్రావి, గ్రక్కున విష మె
క్కినవిధమునఁ బరవశుఁ డై
ఘనసాలమహీరుహంబుకరణిం బడియెన్.

⁠ 395


సీ.⁠

అంత నంతకసూనుఁ డంతరంగంబున
                 సంతాప మెసఁగ వాసవతనూజుఁ
గనుఁగొని “యన్న నీయనుఁగుఁదమ్ములు వోయి
                 కడుఁ దడవయ్యె; నిక్కాననమున
నెయ్యది పుట్టెనో? చయ్యన నీ వేఁగి
                 వారిని దోడ్కొని వారి గొనుచుఁ
జనుదెమ్ము” నావుడు ఘనభుజుం డధిక
                 రయంబున నరిగి, జలాశయంబు

⁠


ఆ.⁠

తీరభూమిఁ బడిన వారి, నవారిత
మహితశౌర్యధనుల, మాద్రిసూతులఁ
జూచి విస్మయైకగోచరుఁ డై సవ్య
సాచి యుల్లమున విషాద మడర.

⁠ 396


క.⁠

నాలుఁగుదిక్కులుఁ గనుఁగొని
యాలో నెవ్వరిని గాన, కత్యంతపిపా
సాలసుఁ డై సలిలంబులు
గ్రోలఁగ సమకట్టి యొయ్యఁ గొలనికి [1]డాసెన్.

⁠ 397


వ.⁠

డాయుటయు నాకాశవాణి యి ట్లని వీతెంచె.

⁠ 398


మ.⁠

“బలిమిం జొచ్చిన నెట్టివారి కయినం బ్రాణంబుపై వచ్చు; నీ
సలిలావాసము మత్పరిగ్రహము; తృష్ణాచ్ఛేద మొందం జలం
బులు ద్రావన్ వలతేనిఁ, బ్రశ్నములకుం [2]బొం దొందఁగా నుత్తరం
బులు నా కి” మ్మనుడున్ మనంబునఁ బృథాపుత్త్రుండు సక్రోధుఁ డై.

⁠ 399


ఉ.⁠

“మ్రుచ్చిలి [3]నిల్చి దుర్వచనముల్ పచరించినఁ జెల్ల నిత్తునే?
చెచ్చెర నీయెలుం గడఁగ జేసెద నిప్పుడు సూడు మంచు వి
వ్వచ్చుఁడు శబ్దభేదిశరవర్గముఁ దద్వచనంబు చక్కటిం
గ్రచ్చఱ నించె మౌర్విరవకంపితసర్వదిగంతరాళుఁ డై.

⁠ 400


ఆ.⁠

ఇట్టు లేయుటయును నెప్పటివాక్యంబు
మఱియు వినఁగఁ బడిన, మఘవసూనుఁ
డలసి కొలను సొచ్చి యంబుపానము సేసి
యిలకు నొఱగె వివశహృదయుఁ డగుచు.

⁠ 401


వ.⁠

తదనంతరంబ యుధిష్ఠిరుండు భీమసేను నాలోకించి “కవలును గవ్వడియును నింత
దడయుటకు నిమిత్తం బెయ్యదియో? నీవు నరుగు” మనినం గిమ్మీరవైరి
మారుతజవంబున నమ్మువ్వురుఁ జనిన చొప్పునం జని పద్మాకరకూలంబునందు
నిద్రావివశులుంబోలెఁ బడియున్న తమ్ములం గని దుఃఖితుం డై.

⁠ 402


తరలము.⁠

“ఇది మనుష్యకృతంబుగాదు; సురేంద్రకిన్నరపన్నగ

⁠
  1. ↑ డిగ్గెన్
  2. ↑ బొల్పారఁగా
  3. ↑ వచ్చి...పచరించినఁ బోవ నిత్తునే