| |
గల మనకు నివ్విధంబున
నలదడి వచ్చుటకు మూల మది యెయ్యదియో?”
|
|
| వ. |
అనిన నమ్మహాప్రాఙ్ఞుం డతని కి ట్లనియె.
| 383
|
| క. |
“వినుము సుఖమునకు దుఃఖం
బునకుం గారణము దనదు పూర్వకృతం బై
చను కర్మమ; కారణ మిది
యని యన్యము గలుగనేర దం డ్రొక్కటియున్.”
| 384
|
| చ. |
అనుటయు భీమసేనుండు నకులున కి ట్లనియె.
| 385
|
| చ. |
“ప్రాతికామి వోయి పాంచాలిఁ గొలువులో
పలికిఁ [1]దేర, నపుడ యలుక యెసఁగ
నాంబికేయసుతుల నందఱఁ దునుమ కే
నునికి నిట్టి యెడరు మనకుఁ బుట్టె.”
| 386
|
| చ. |
అనవుడు నర్జునుం డనియె “నా సభ సూతసుతుండు పేర్చి ప
ల్కిన పటువాక్యముల్ వినియుఁ గిన్కకుఁ బూనక యేఁ దొలంగి కా
ననమున [2]కిట్లు కాతరజనంబులచాడ్పున నేఁగుదెంచుటన్
మనకు దురంతదుఃఖములు మానక పైకొని వచ్చెఁ దమ్ముఁడా.”
| 387
|
| వ. |
అనిన యనంతరంబ సహదేవుం డి ట్లనియె.
| 388
|
| ఆ. |
“దుష్టశీలుఁ డైన దుర్ద్యూతపరుని గాం
ధారుఁ బట్టి యేను దడయ కపుడ
తునుమ కునికి, నిట్టి దుర్దశ[3]పా లైతి
మనఘ! మనము కాననాంతరమున.”
| 389
|
| చ. |
అని యిట్లందఱు నన్నితెఱంగులఁ బలుకుచుండ నజాతశత్రుండు నకులుం జూచి
“భవదీయసోదరు లత్యంతపిపాసితు లైనవారు నీ విమ్మహీరుహం బెక్కి జలంబు
లున్నయెడ యరయు” మనిన నతండును దద్వచనానురూపంబున నవ్వనస్పతిస
మారోహణంబు సేసి, దెసలు గలయం బరికించి దూరంబున సలిలంబు లున్న
వని యన్న కెఱింగించిన నతం “డట్లేని నీవు పోయి జలపానంబు సేసి, మాకును
జలంబులు గొని ర” మ్మని పనుచుటయును, మాద్రేయుండు వృక్షావతీర్ణుం డయి
రయంబునం జని, ముందట నతిమనోహరం బగుతటాకంబుఁ గని, జలంబులు
ద్రావంబోయిన నొక్కయశరీరభూతం బి ట్లనియె.
| 390
|
నకులాదులు యక్షుని నిరాకరించి నీరు ద్రావి మూర్ఛితులగుట
| క. |
“ఓయన్న! యీతటాకము
నాయది; నీ వీజలము గొనఁగ వలతేనిన్
నాయడిగిన ప్రశ్నములకు
ధీయుత! యుత్తరము లిమ్ము తేటపడంగాన్.”
| 391
|
| క. |
అనుటయు నవ్వాక్యముదెస
ననాదరము సేసి, నకులుఁ డక్కొలనం ది
య్యని నీరు ద్రావి నిశ్చే
తనుఁ డై యక్షణమ పడియెఁ దత్తీరమునన్.
| 392
|
| వ. |
అట ధర్మపుత్త్రుండు సహదేవుం గనుంగొని “నకులుండు జలంబులకుం జని తడసె;
నీ వరిగి యతనిం దోడ్కొని జలంబులు గొనుచు రమ్మ” నిన నక్కుమారుం
|
|
- ↑ దెచ్చి...మనకు నొలసె; మనకుఁ గలిగె
- ↑ కిట్టు లాతురజనంబుల...మానక పైపయి వచ్చుఁ
- ↑ వాటిల్లె, ననఘ మనకుఁ గాననాంతరమున