Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.⁠

ఎచట నున్ననైన నెల్లప్పుడును నిన్నుఁ
గన్నులారఁ జూడ గాంచుఁ గాన
తనయ! నిన్నుఁ గనిన తపనుండు గడు ధన్యుఁ
డయ్యె; మందభాగ్య నైతి నేను.

⁠ 346


చ.⁠

ఇనుఁ డఱచేత మాటు వడు టెన్నఁడుఁ గల్గునె? నిన్ను నెమ్మి నేఁ
గనియెదఁ గాక యింక నొకకాలమునం దయినం; దనూజ! నీ
వినుతశరీరభావమును, వీనుల సన్మణికుండలంబులున్,
ఘనతరవజ్రవర్మముఁ బ్రకాశత నొందక యుండ నేర్చునే?

⁠ 347


చ.⁠

దివి, భువి, నంతరిక్షమున, దిక్కుల, గాడ్పున, నగ్నియందు, న
ర్ణవములయందు, ఘోరవిపినంబులయందును నీకు [1]నెప్పుడున్
శివ మగుఁ గాక! దిక్పతులు, సిద్ధులు, సాధ్యులు, రుద్రు, లాశ్వినుల్
పవనలుఁ బుత్త్ర! నిన్నుఁ గృపఁ బాయక యెప్పుడుఁ గాచుచుండెడున్.”

⁠ 348


వ.⁠

అని యేడ్చుచుం గుంతి యచ్చటం దడయ వెఱచి గూఢప్రకారంబునఁ గన్యాం
తఃపురంబునకు వచ్చి, యెప్పటియట్ల వర్తిల్లుచుండె; నట మంజూషయు నశ్వ
నదీప్రవాహవేగంబునఁ జర్మణ్వతికిం జని, యందుండి యమునాగతం బై,
యట చని భాగీరథిం బడి, సూతవిషయంబునం బంపానగరంబుచేరువ నరుగు
చుండె; నాసమయంబున.

⁠ 349


సీ.⁠

ధృతరాష్ట్రసఖుఁ డైన యతిరథుం డను సూతుఁ
                 డతివలుఁ దానును నతివిభూతి
గంగలో జలకేళిసంగతుం డై యుండి
                 తుంగతరంగానుషంగవశతఁ
జనుదెంచు [2]మంజూషఁ గని, కడు వేడుకఁ
                 దన పరిజనములఁ బనిచి పట్టి
తెప్పించి ధీయుక్తి యొప్ప నేకతమున
                 నప్పెట్టెఁ దెఱచి తా నప్పు డందు

⁠


ఆ.⁠

వినుతహేమకవచుఁ, గనకకుండలధరు
ననుపమానతేజు, ఘనుఁ గుమారుఁ
గని మనంబులోన ననయంబు విస్మయం
బొనర గ్రుచ్చి యెత్తికొని ముదమున్.

⁠ 350


వ.⁠

తనజీవితేశ్వరియైన రాధం జూచి యి ట్లనియె.

⁠ 351


క.⁠

“అనపత్యుల మగు మనకును
మనపాలిటి వేల్పు నిక్కుమారుని నిచ్చెన్;
వనజాక్షి! వీఁడు మానుష
జనితుఁడు గాఁ; డరయ దేవసంభవుఁడు సుమీ.”

⁠ 352


క.⁠

అని దానిచేతి కిచ్చినఁ
గొని యురమునఁ [3]గదియ నదిమి కొనియెఁ గొడుకు న
వ్వనితకుఁ బాలెంతతెఱం
గునఁ జన్నులు సేఁపె నపుడు గూరిమిపేర్మిన్.

⁠ 353


వ.⁠

ఇ ట్లాదంపతులు ప్రమోదసంపద సొంపారఁ గుమారుం గొని నిజమందిరంబున
కరిగి, యాత్మీయకులోచితంబు లగు జాతకర్మాదిసంస్కారంబు లొనరించి, సహజ
కుండలాలంకృతకర్ణుం డగుటం జేసి వానికిఁ గర్ణుం డని నామకరణంబు సేసి రంత.

⁠ 354


క.⁠

వసువర్మధరుఁడు గావున
వసుసేనుం డనెడు పేరు వాని కిడిరి పెం
పెసఁగఁగ భూసురు; లాది
త్యసుతుం డిబ్భంగి సూతతనయుం డయ్యెన్.

⁠ 355


వ.⁠

తద్వృత్తాంతం బంతయుఁ గుంతి తనయాప్తచరులవలన విని శిథిలీకృతసంతాప

⁠
  1. ↑ నెల్లెడన్
  2. ↑ మంజసఁ గని
  3. ↑ నదిమి కొనియెఁ గొడుకు నతివ; యవ్వనితకుఁ