Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

శత్రువర్గంబు నిశ్శేషంబు సేయు; వినీతుండయి విప్రులచేత [1]ననుశాసితుం డయిన
రాజునకు నలబ్దలాభాదిత్రితయంబు సంపన్నం బగు; బ్రాహ్మణరహితుం డయి
ధర్మహీనుం డయిన రాజును బ్రజ వలవలదు; ప్రజానురాగంబు లేనివానికి రా
జ్యంబు సుస్థిరంబు గానేరదు; మీరు బ్రాహ్మణప్రియులరు; ధర్మనిత్యుల; రెప్పుడు
ను మీ కభ్యుదయం బగు” నని బకదాల్భ్యుం డరిగినఁ బాండవులుం దమయి
ష్టంబున నుండి దుఃఖోపశమనంబు లయిన కథలు సెప్పుకొనుచున్న యవసరం
బున ద్రౌపది ధర్మరాజున కి ట్లనియె.

⁠ 207

ద్రౌపదీధర్మరాజుల సంవాదము

ఆ.⁠

“వృద్ధు గొడుకుపలుకు విని [2]క్రూరుఁ డై పాప
బుద్ధిఁ జేసి మిమ్ము భూతలంబు
వెలువరించి రాజ్యవిభవంబు గొని యిప్పు
డలుక సెడి సుచిత్తుఁ డయ్యె నొక్కొ!

⁠ 208


ఆ.⁠

అద్దరాత్ముహృదయ మది యయఃపాషాణ
నిష్ఠురంబు; ధర్మనిధుల మిమ్ము
నట్లు గొడుకు లెగ్గు లాడంగఁ బోయిన
[3]వల దనండ కలహవాంఛఁ జేసి.

⁠ 209


సీ.⁠

విమలహర్మ్యంబుల విహరించువారలఁ
                 బ్రియ[4]మహార్హాసనశయనరతులఁ
జందనాగురులిప్తచారుసర్వాంగుల
                 నతవరనాథసేవితుల; మిమ్ము
వనమునఁ గ్రుమ్మరు వారిఁ గాఁ; గుశబృసీ
                 శయనాభిరతులఁ గా; నియతరూక్ష
భూరేణుధూసరీభూతవిగ్రహులఁ గా
                 ద్రుతవన్యమృగనిషేవితులఁ గాఁగ.

⁠


ఆ.⁠

నిట్లు సూచి చూచి యే నెట్లు చిత్తోప
శాంతి సేయుదాన? సకలభోగ
విషయవిరతిఁ జేసి విధియును ధృతరాష్ట్రు
నట్లు మీకు నహితుఁ డయ్యె నొక్కొ!

⁠ 210


క.⁠

భవదాజ్ఞానిగళంబునఁ
దవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర! నీ
యవరజు లిడుములఁ బడి కడుఁ
జివికిరి చెఱఁబడిన సింహశిశువులభంగిన్.

⁠ 211


ఆ.⁠

పరనరేంద్రమకుటపద్మరాగద్యుతి
నరుణ మగు భవత్పదాబ్జయుగము
[5]పరుషధారుశిలలపై నిప్పు డరుగుట
నరుణ మయ్యెఁ బర్వతాంతరముల.

⁠ 212


క.⁠

అనవరతసౌఖ్యసంపదఁ
బెనుపొందుచు నుండు మీకు భీకరకాంతా
రనివాసాయాసంబుల
ననఘా! యిబ్భంగి నవయ నలమట వొడమెన్.

⁠ 213


వ.⁠

నిత్యంబునుం బదివేవురు బ్రాహ్మణులు బ్రాహ్మవిదులు [6]బసిండితళిగల నిష్టాన్నం
బులు గుడిచి తృప్తు లయినం దద్భుక్తశేషం బుపయోగించుచుండు నీకు
వన్యమూలఫలాశనంబు లుపయోగించుచు నన్యులయందుఁ గ్రోధంబు విడిచి
యునికి యుచితంబు గాదు.

⁠ 214


సీ.⁠

పదివేల గజముల బలమున విలసిల్లు
                 ననిలసుతుండు గాఱడవిలోనఁ

⁠
  1. ↑ నధిష్ఠితుం డయిన; ననుష్ఠితుం డయిన; వినీతుం డయిన; శిక్షితుం డయిన రాజునకు నలబ్ధలాభాదిచతుర్వర్గంబు ... ప్రజ వొందదు ... రుచిరంబు గానేరదు
  2. ↑ బాపబుద్ధియై, పొదలి యిట్లు మిమ్ము; క్రూరహృదయుఁడై, నీతి మాలి మిమ్ము
  3. ↑ వలవదనఁడ
  4. ↑ మహర్హామృదుశయన
  5. ↑ పరుషధాతు
  6. ↑ పసిండిపళ్లియల; బసిండిపళ్లెరంబుల