Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

యడవిలోపల నంచు, హా సుత యంచు ధైర్యము డించుచున్.

⁠ 270


వ.⁠

ఉన్నంతఁ దదాశ్రమవాసులైన మును లందఱు నతనిం బొదివికొని, తదీయనయ
నలాభంబునకు విస్మయం బందుచు, నుచితవాక్యంబుల నతని నాశ్వాసించుచుం
డిరి; తదనంతరంబ యొక్క ముహూర్తంబునకు సావిత్రీసహితు డై చిత్రాశ్వుం
డు సనుదెంచిన, నావృద్ధదంపతు లత్యంతహర్షంబున నతనిం గౌఁగిలించుకొని,
మూర్ధాఘ్రాణంబు సేసిరి; మునివరులును గరంబు సంతసిల్లి; రప్పు డా రాజర్షిము
ఖ్యుండు పుత్త్రునిం జూచి “యయ్యా! యి ట్లేల వనంబులో మసలి” తని యడిగిన,
నతండు దాను జని పండ్లు గోయుటయును, గాష్టదళనంబు సేయునెడం దల
యేరు గదిరి నిలువనోపక విశ్రమించుటయుఁ, ద న్నొక్కపురుషుండు గలలోన
నిగ్రహించుటయుం జెప్పునెడ, సావిత్రి మామ కి ట్లనియె.

⁠ 271


సీ.⁠

“ఈరాజసుతునకు నిద్దినంబున మర
                 ణం బని మును చెప్పె నారదుండు;
మునినాథువచనం బమోఘంబు గావున
                 నేమఱ కేను నేఁ డితనితోడ
నడవికి నేఁగితి; నచట నీతఁడు సుప్తుఁ
                 డై యున్న యెడ వచ్చె నంతకుండు;
వచ్చి యివ్విభుని జీవముఁ గొని పోవంగ
                 వెనుక చని యేను వివిధభంగి

⁠


ఆ.⁠

సత్యధర్మఫణితి సంస్తుతించుటయుఁ, గృ,
పార్ద్రచిత్తుఁ డగుచు నజ్జముండు
నాకు నెమ్మి నొసఁగె నాలుగు వరము;
లం దొకట నితఁడు జీవయుక్తుఁడయ్యె.

⁠ 272


వ.⁠

మఱియు నొక్కవరంబు భవదీయనయనోన్మేషణకారణం బయ్యె; దక్కిన వర
ద్వయంబునకు మీకు వైరిహృతరాజ్యసంప్రాప్తియు, మదీయజనకునకుఁ బు
త్త్రశతలబ్ధియు నగు” నని చెప్పిన నయ్యిద్దఱుఁ బరమానంద[1]కందళితశీతలశిశి
రహృదయు లై కోడలి కి ట్లనిరి.

⁠ 273


క.⁠

“ఆపత్సముద్రమగ్నం
బై పోయెడు నద్మదన్వయము పెం పెసఁగం
దేవ యయి కడవఁ బెట్టిన
నీపుణ్యచరిత్ర గీర్తనీయము దల్లీ.”

⁠ 274


వ.⁠

అని యభినందించి; రప్పు డయ్యిందువదనను మునివరు లందఱుఁ బ్రశంసావచ
నంబుల నుపలాలించి, వారల దీవించి, నిజగృహంబులకుం జని; రంతం గతిప
యదినంబులకు.

⁠ 275


సీ.⁠

ఆసాళ్వభూపతి యాప్తమంత్రులు, మూల
                 భృత్యులుఁ, బౌరులుఁ బృథివిఁ గలుగు
పెద్దలుఁ గూడి సంప్రీతి నాతనిపాలి
                 కేతెంచె వినయసమేతు లగుచు,
“నవనీశ! నీశత్రుఁ డాత్మీయమిత్రభే
                 దమునఁ జేసి బాంధవసహాయ
సహితుఁ డై మృతిఁ బొందె సకలజనంబులు
                 నేకచిత్తంబున నిపుడు నిన్నుఁ

⁠


ఆ.⁠

బ్రకటరాజ్యపదవిఁ బట్టంబు గట్టంగ
వచ్చినారు; నిఖిలవసుధయందు
విస్తరిల్లె నీదు విజయఘోషము; భద్ర
గజము నెక్కి వేగ కదలు మింక.

⁠ 276


క.⁠

ప్రాకటతపోబలంబున,
నాకలితవిలోచనుండ వై యున్న నినున్

⁠
  1. ↑ కందళితహృదయులై