| సీ. |
కౌఁగిట ననుఁ జిక్కఁ గదియించి శిరము మూ
ర్కొంచును బాష్పముల్ గురియుచుండఁ
“బట్టి! మాయొడలును, బ్రాణంబులును, నెల్ల
యర్థముల్ నీవ; మాయన్న! నీవు
దేసగా సంసారతీరంబు సేరెద
మని తలంచెదము సు మ్మన్న; యన్న!
కన్నులు లేని మా[1]కన్నులుఁ గాళులు
నీవ కదన్న! మానిఖిలవంశ
|
|
| ఆ. |
మును సముద్ధరించు మోపు నీయదియ క
దన్న” యనుచు నిట్టు లగ్గలంపుఁ
బ్రేమ ననుదినంబుఁ బ్రేముడింతురు వృద్ధు
లక్కటకట! యేమి యైరొ నేఁడు!
| 262
|
| ఆ. |
అడవి కేఁగుదెంచి యడరంగ ఫలమూల
తతులు గొనుచు నేను దడయ కపుడ
పోవ [2]నోప నైతి; దైవోపహతి నింత
చిక్కువడితి; నేమి సేయువాఁడ?
| 263
|
| క. |
నా యున్నచో టెఱుంగక
యా యాశ్రమవాసు లైన యందఱ యతిదుః
ఖాయత్తుఁ డగుచు నడుగును
మాయయ్య దలంకి మాటిమాటికి [3]నన్నున్.
| 264
|
| క. |
నావార్త వినక యింతకు
నావృద్ధులు ఖిన్నహృదయు లై ప్రాణంబుల్
వో విడుతురు గా; కచటికి
బోవం బని గలదె? యేనుఁ బుచ్చెద నసువుల్.”
| 265
|
సత్యవంతుఁడు సావిత్రితోడ మరలి తన యాశ్రమంబునకు వచ్చుట
| వ. |
అని బహుప్రకారంబులం బలవరించి, కన్నీరు నించిన నక్కాంత దుఃఖాక్రాంత
యగుచు నతని నాశ్వాసించి, నవమృణాళమృదులంబు లగు భుజంబులం గౌఁగి
లించి, యెగయ నెత్తిన మెత్తన లేచి, యతండు ధూళిధూసరితం బైన శరీరంబు
దొడసికొని గమనంబున కుత్సహించిన.
| 266
|
| ఆ. |
ఫలభారము దుర్భర మని
వెలఁది యచట నొక్కవృక్షవిటపంబున ని
మ్ముల గరడియ దగిలిచి యు
జ్జ్వలపరశువుఁ గొనుచు మృదులసంభ్రమలీలన్.
| 267
|
| వ. |
జీవితేశ్వరు వామబాహువు నిజవామభుజంబుపయి నిడికొని, దక్షిణహస్తంబున
నతని గ్రుచ్చి గౌఁగిలించి, మందగమనంబున నాశ్రమోద్దేశంబునకు మగిడె;
నంత నక్కడ.
| 268
|
| ఉ. |
కన్నులు వచ్చి యెల్లెడలుఁ గన్గొని, వృద్ధనరేంద్రుఁ డాత్మకుం
గన్నులుఁ బోలెనైన తన గాదిలిపుత్త్రుఁడు గాననంబులో
నెన్నఁడు లేని యంతతడ వేటికిఁ జిక్కెనొ? యంచు నార్తితోఁ
గన్నులు లేనియ ట్లొకఁడుఁ గానక యేడ్చె సతీసమేతుఁ డై.[4]
| 269
|
| తరలము. |
కొడుకు నిందును నందు రోయుచుఁ గోరి ప్రేమభరంబునం
గొడుకుసద్గుణకోటు లెల్లను గోటిభంగుల [5]మక్కువన్
గడన సేయుచు, సత్యవంతునిఁ గానరే మునులార! యీ
|
|
- ↑ కన్నయ్యుఁ గాలయ్యు
- ↑ ఁగాన...హతిఁ జేసి
- ↑ నింకన్
- ↑ 269-270-వ పద్యములకు నడుమ 'ఉ. ఎందులకేఁగి తన్న తరళేక్షణ నీపతితోడ రావు మ, మ్మిందుల నీగతిన్ విడిచి యేఁగఁగఁ బాడియె పుత్త్ర యింక నే, కందువ నున్నవాఁడ వని కానఁగ నేర్తు వనంబులోన మా, కందకుచందనాగరుసుగంధకదంబములోన మ్రోలతన్.' అని యొకప్రతియందున్నది.
- ↑ నోలి ను, గ్గడన