Jump to content

పుట:భారతం-ఆరణ్యం.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

దోడ్కొని పోవలయు” ననిన నతండు “నీవు త్రిరాత్రోపవాసంబునం జేసి యెం
తయు డస్సినదానవు; రానోప” వనిన నది వాని కి ట్లనియె.

⁠ 208


మ.⁠

“ఉపవాసశ్రమ మించుకేనియును నాయుల్లంబునం దోఁప; దీ
విపినం బుజ్జ్వలపుష్పపల్లవఫలావిర్భూతినానా[1]లతా
గ్రపరీతం బన విందుఁ; జూడఁగ మదిం గౌతూహలం బయ్యె; న
న్నుపరోధింపకు; మింతవట్టు చన వీ యుక్తుండ వెబ్భంగులన్.”

⁠ 209


వ.⁠

అనిన నతం డట్ల కాక చనుదె మ్మనుటయు సావిత్రి చయ్యనం జని, భార్యాసహి
తుం డయి యున్న తన మామకుం బ్రణమిల్లి “మీకొడుకు వనంబునకు నగ్నిహో
త్రార్థంబు సమిధలు దేర నరిగెడు; నాకును నతనితోడన చని వనంబు సూడ
వేడ్క యైనది; మీరు నా కివ్వరంబు గృపసేయవలయు” ననిన నాతం “డిమ్మ
గున యెన్నండును నెయ్యదియును నడుగ; దిత్తెఱంగు దీనికిం బ్రియం బై యు
న్నది; నాకు నివారింప నేల?”యని తలంచి యనుమతించిన నయ్యిరువురయడుగు
లం బడి వీడ్కొని.

⁠ 210

సత్యవంతుఁడు సావిత్రీసహితుం డై వనంబునకుం బోవుట

క.⁠

చిత్తంబునఁ [2]బైకొనియెడు
నుత్తల మడఁచుచును, ముఖపయోరుహమునఁ ద
ళ్కొత్తెడు వెడనవ్వునఁ బ్రియు
చిత్తం బిగురొత్తఁ జనియెఁ జెలువ యడవికిన్.

⁠ 211


వ.⁠

ఇ ట్లాదంపతులు మందగమనంబున నరిగి పరిసరారణ్యంబు దఱియం జొచ్చి
రప్పుడు.

⁠ 212


సీ.⁠

కమనీయకమలినీకల్లోలవీథులఁ
                 గదలు రాయంచల[3]గతుల యొప్పు,
బహుపుష్పపల్లవప్రకరచిత్రితము లై
                 తనరారు తరులతాతతుల సొంపు,
మకరందరసపానమదవిలోలంబు లై
                 క్రాలెడి యెలదేఁటిగముల యులివుఁ,
బరిపక్వమంజులఫలరసోద్ధతము లై
                 పలుకు రాచిలుకల పటురవంబుఁ,

⁠


ఆ.⁠

బ్రియుఁడు వేఱువేఱ ప్రీతిమైఁ జూపుచుఁ
జెప్పుచును జనంగఁ, జిగురుఁబోఁడి
గనుచు వినుచు నిర్వికారసల్లాప మిం
పార నతని తెఱఁగు నరయుచుండె.

⁠ 213


వ.⁠

తదనంతరంబ యారాజర్షినందనుండు మధురంబు లగు ఫలంబులు గోయుచు
గరిడియ నిండించి, యొక్కయెడఁ బరశుపాతంబునఁ కాష్ఠదళనంబు సేయం
దొడంగి, శ్రమంపడి యొల్లంబోయి, గొడ్డలి పుడమిపయి వైచి నిరంతరనిశ్వాస
వేగ[4]వివర్ణవదనుం డగుచు సావిత్రిం గనుంగొని.

⁠ 214


చ.⁠

“ఒడలు వశంబు గాదు; భ్రమనొందినయట్లు మనంబు దూలెడిం;
గడఁగి శిరంబు శూలవిశిఖప్రకరంబున నొంచినట్టి ద
య్యెడు; నిలువంగ నోర్వ; నొకయించుకసేపు శ్రమంబు దీఱ నీ

⁠
  1. ↑ లతాగ్రపరీతం
  2. ↑ గైకొనియెడు, నుత్తలము నడంచి ముఖపయోజంబునఁ
  3. ↑ గముల...సల్లాపంబు, లార; సల్లాప మొ, ప్పార
  4. ↑ విషణ్ణవదనుం