| |
నశ్వపతి నారదు దెసఁ జూచుటయు నతం డి ట్లనియె.
| 184
|
| చ. |
“గొనములప్రోక నీ యనుఁగుఁగూఁతురు; దీని తలంపు మాన్పఁగా
మనకు నశక్య; మింక ననుమానము లేల? నరేంద్ర! కూఁతుఁ జ
య్యన నృపసూతి కిమ్ము; కమలానన చేసిన పుణ్యగౌరవం
బున నయినం బ్రియుండు పరిపూర్ణచిరాయురుపేతుఁ డయ్యెడున్.”
| 185
|
| వ. |
అనిన నమ్మహీపతి యమ్మునిపతికి మ్రొక్కి “నీవు మాకుం బరమగురుండవు; నీ
యాన తిచ్చినట్ల చేసెద” ననిన నారదుండు వారి దీవించి దివంబునకుం జనియె
నంత.
| 186
|
| సీ. |
అమరఁ బుణ్యదినంబునందు బాంధవమంత్రి
వృద్ధపురోహితవితతితోడ
సావిత్రిఁ దోడ్కొని, జననాయకుండు వై
వాహికమహనీయవస్తుకోటి
గొనుచుఁ, బుణ్యారణ్యగోచరుం డై తప
[1]స్స్థిరుఁ డైన యాద్యుమత్సేను కడకుఁ
జనిన, నారాజును సంభ్రమంబున నశ్వ
పతికి నర్ఘ్యాదిసంభావనంబు
|
|
| ఆ. |
లాచరించి; సముచితాభిమతాలాప
పూర్వకముగ సుజనపూజ్యుఁ డతని
యాగమననిమిత్త మడిగిన, మద్రేశుఁ
డెలమి సాల్వపతికి నిట్టు లనియె.
| 187
|
| క. |
“ఈకన్నియ నాకూఁతురు
మాకులమున కెల్లఁ దేవ; మనుజోత్తమ! నీ
వీకన్నియఁ గోడలుగాఁ
గైకొనుము మదీయవచనగౌరవ[2]బుద్ధిన్.”
| 188
|
| వ. |
అని పలికి సావిత్రి నతనికి నభివందనంబు సేయించి మఱియు నతండు.
| 189
|
| క. |
“నీకొడుకు సత్యవంతున
కీకన్నియు దగు; నరేంద్ర! యీకన్నియకున్
నీకొడుకు దగు; ననన్యగు
ణాకరు లియ్యిరువురును సమంచితమూర్తుల్.
| 190
|
| వ. |
అనిన నతనికి ద్యుమత్సేనుం డి ట్లనియె.
| 191
|
| తే. |
“విగతరాజ్యుల మై ఘోరవిపినములకు
వచ్చి యిమ్మెయిఁ దప మున్నవార మేము;
బాల, సుకుమారి యిది జనపాల! యడవి
నుండి మాతోడి యిడుమకు నోర్చునయ్య?”
| 192
|
| వ. |
అనిన నశ్వపతి యతని కి ట్లనియె.
| 193
|
| చ. |
“కలిమియు లేమియున్ సతము గా; వవి సెందినచోఁ జెలంగుచుం
గలఁగుచు నున్కి ధీరులప్రకారమె? లెస్సగ నింతవట్టు నేఁ
దెలియుదుఁ; జెప్పెదన్ వసుమతీవర! పిన్న యనంగ[3]నేల? నే
కొలఁదియుఁ గాదు; ధీరమతి గూఁతురు; పేర్కొనఁ జాలఁ బెంపునన్.
| 194
|
| క. |
నీతోడ వియ్య మందగఁ
దేజోగతి నాసఁ జేసి చెచ్చెర నిట్లే
నేతెంచితి; మత్ప్రార్థన
బ్రాఁతిగఁ జేకొనక యునికి పాడియె నీకున్?”
| 195
|
సావిత్రి సత్యవంతుని వివాహం బగుట
| వ. |
అనుటయు నయ్యంధనృపతి తత్సంబంధంబునకు సంతసిల్లి, నిజాశ్రమవాసు
|
|
- ↑ స్స్థితుఁ
- ↑ యుక్తిన్
- ↑ నేర...జాలుఁబెంపునన్