| చ. |
అభినవభానుబింబరుచిరాకృతియున్, హరి[1]యుగ్యమున్, మహా
రభసదురాసదంబును, విరాజితకేతనవైజయంతికా
ప్రభమును నైన తేరు సురపాలకుపంపునఁ జేసి రాఘవ
ప్రభునకుఁ దెచ్చి మాతలి సభక్తికుఁ డై ప్రియ మొప్ప ని ట్లనున్.
| 146
|
| మ. |
“ధరణీనాథ సురేంద్రుతే రిది మహాదైత్యేంద్రులం దొల్లి యీ
యరదం బెక్కి యనేకులం దునిమె బంభారాతి ఘోరాజి; నీ
యరదం బెక్కి వధింపు మీవును మదీయస్ఫారసారథ్యని
ర్భరభంగిన్ దశకంధరుం ద్రిభువనీభంగోన్నమత్కంధరున్.”
| 147
|
| మ. |
అనినన్ మాతలి నాదరించి, యరదం బారాఘవుం డెక్కి, యు
క్కున మీఱెన్ రిపుకోటిమీఁద విసలత్కోదండమౌర్వీమహా
స్వనభిన్నాఖిలదిగ్విభాగుఁ డగుచున్, [2]శాతాస్త్రధారాభిషే
చనపూతప్రతిపక్షసైన్యుఁ డగుచున్ సంరంభదుర్వారతన్.
| 148
|
| ఉ. |
అత్తఱి రావణుండు విలయానలదుస్సహమూర్తి యై నరేం
ద్రోత్తముమీఁదఁ దేరు గడు నుగ్రగతిం బఱపించి, సంతతో
ద్వృత్తశరప్రవాహపరివీతదిశాముఖుఁ డైనఁ జూచి, పే
రుత్తల మంది రాతనిసముద్ధతికిన్ [3]దివినుండి నిర్జరుల్.
| 149
|
| వ. |
ఇట్లు దలపడి రామరావణు లతిఘోరంబుగాఁ బోరం దొడంగి; రంతఁ బంక్తి
వదనుండు నిబిడజ్వాలాకరాళం బగు శూలంబు రాఘవుమీఁదం బ్రయోగించిన నతం
డును నడుమన దానిఁ దునియలు సేసిన, నీసునం బెరిఁగి సురవైరి మఱియునుం
దరతరంబ శతసహస్రసంఖ్యలు గల శూలంబులు, భిండివాలంబులుఁ, దోమరంబులు,
శరంబులుం బఱఁగించి యంబరం బెల్ల నస్త్రమయంబు గావించిన, నఖిలభూతం
బులును హాహాకారవ్యాకులంబు లయ్యె; నసురసైన్యంబున భేరీప్రముఖతూర్య
నినదంబులు, సింహనాదంబులు సెలంగెఁ; నంతఁ గొండొకసేపునకు రావణప్ర
యుక్తం బైన శస్త్రాస్త్రదహనం బంతయు నిరంతరవిశిఖధారాసారంబునం గబళిం
చి, రామజలధరంబు గంభీరసారంబునం బొదలుటయు సకలప్లవంగసముద
యంబును బ్రహర్షకోలాహలం బయ్యెఁ; బదంపడి.
| 150
|
శ్రీరాముఁడు రావణాసురుని సంహరించుట
| సీ. |
కమనీయకనకపుంఖప్రభాభాసియుఁ,
దీక్ష్ణముఖంబును, దివిజయక్ష
మునిసిద్ధసాధ్యసమ్మోదావహంబు నై
విలసిల్లు బాణ [4]మవ్వీరవరుఁడు
గైకొని బ్రహ్మాస్త్రకలితమంత్రాభియు
క్తంబుగా నొనరించి, కార్ముకమున
సంధించి జగములు జయపెట్టఁ జెచ్చెరఁ
దివిచి యేయుటయును; దీవ్రభంగిఁ
|
|
- ↑ యుక్తమున్
- ↑ శస్త్రాస్త్రధారాభిషే, చనధూతప్రతిపక్ష
- ↑ వినువీథి
- ↑ ముర్వీవరుండు